చెల్లికి క్యాన్సర్ అని నమ్మించి స్నేహితుడికి రూ.2 కోట్లు బురిడి కొట్టించిన కి 'లేడి'

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అతడి స్నేహితురాలు దారుణంగా మోసం చేసింది. చెల్లికి క్యాన్సర్ చికిత్స అని చెప్పి ఏకంగా రూ.2 కోట్లకు పైగా దోచుకుంది.

New Update
Gurugram Man Loses Rs 2 Crore After Friend Fakes Sister's Cancer Treatment

Gurugram Man Loses Rs 2 Crore After Friend Fakes Sister's Cancer Treatment

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అతడి స్నేహితురాలు దారుణంగా మోసం చేసింది. చెల్లికి క్యాన్సర్ చికిత్స అని చెప్పి ఏకంగా రూ.2 కోట్లకు పైగా దోచుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ తన చెల్లెలు క్యాన్సర్‌ బాధపడుతున్నట్లు ఆమె స్నేహితుడిని నమ్మించింది. చికిత్స పేరుతో గతేడాది మే నుంచి 2025 ఏప్రిల్ వరకు ఏకంగా రూ.2.18 కోట్లు అతడి నుంచి తీసుకుంది. ఆ నగదును ఆమె బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకుంది. 

Also Read: వొడాఫోన్ ఐడియాకు కేంద్రం బిగ్ రిలీఫ్.. రూ. 87,695 కోట్ల బకాయిల నిలిపివేత!

చివరికి చెల్లికి క్యాన్సర్‌ పేరుతో ఆమె మోసం చేసిందని అతడు తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ తన స్నేహితుడితో కలిసి ఆ వ్యక్తిని మోసం చేసినట్లు గురుగ్రామ్ ఆర్థిక నేర విభాగం పోలీసులు తెలిపారు. ఆమె స్నేహితుడైన అజార్ అహ్మద్‌(30)ను డిసెంబర్ 30న పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల రిమాండ్ తర్వాత గురుగ్రామ్‌కు తరలించారు.  

Also Read: ఫుల్లుగా తాగి పడిపోతే ఇంటిదగ్గర దింపేస్తాం.. న్యూఇయర్‌ వేడుకల వేళ ప్రభుత్వం సంచలన నిర్ణయం

అజార్ అహ్మద్‌ ఫోన్‌ నెంబర్‌తో ఆ మహిళ తనకు డబ్బులిచ్చిన వ్యక్తితో మాట్లాడినట్లు పోలీసులు చెప్పారు. ఆమె బ్యాంకు ఖాతాకు పంపిన రెండు కోట్లకు పైగా నగదును  అజార్ అహ్మద్‌ తన బ్యాంకు అకౌంట్‌లోకి మళ్లించుకున్నట్లు తెలిపారు. దీంతో ఆ మహిళ ఆచూకి కోసం అతడిని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆమెను అరెస్టు చేస్తామని వెల్లడించారు. 

Advertisment
తాజా కథనాలు