/rtv/media/media_files/2025/09/05/ganesh-idol-2025-09-05-17-57-45.jpg)
Ganesh Idol
దేశంలో వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతాయి. వాడవాడకు సందడి వాతావరణం నెలకొంటుంది. సాధారణంగా ఒకటిన్నర, 3,5,7,9,11 రోజులకు నిమజ్జనం చేస్తారు. అయితే మహారాష్ట్ర(Maharashtra) లోని ఓ గ్రామంలో మాత్రం వినాయక నిమజ్జమనే(ganesh-immersion) జరగదు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా ? మీరు విన్నది నిజమే. ఇలా ఎందుకు చేస్తారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. నాందేడ్ జిల్లా భోకర్ తాలుకాలోని పాలజ్ అనే గ్రామం ఉంది. ఇక్కడ గత 77 ఏళ్లుగా కలపతో తయారుచేసిన ఓ వినాయకునికి అసలు నిమజ్జనమే లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
Also Read: 50 వేల విగ్రహాలు.. 30 వేల మంది పోలీసులు.. ఈ సారి నిమజ్జనం ప్లాన్, రూట్ మ్యాప్ ఇదే!
Ganesh Idol Was Not Immersed In Maharashtra
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ పాలజ్ గ్రామం ఉంది. ఇక్కడ 90 శాతం మంది తెలుగువారే ఉంటున్నారు. ఒకరోజు ఆ గ్రామంలో ఉంటున్న సంటి భోజన్న అనే వ్యక్తికి కలలో వినాయకుడు కనిపించి గణేశ్ ఉత్సవాలు(Ganesh Celebrations 2025) చేయాలని.. కానీ నిమజ్జనం చేయొద్దని చెప్పాడట. దీంతో భోజన్నతో పాటు మరికొందరు కలిసి విగ్రహం ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. తెలంగాణలోని నిర్మల్‌కు చెందిన శిల్పి గుండాజి పాంచల్‌కు విగ్రహ తయారీ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఒక చెట్టు కలపతో వినాయకుని ప్రతిమను తయారుచేశారు.
Also Read: తెలంగాణలో విషాదం.. ఆమెకు 15, అతడికి 38 ఏళ్లు.. భద్రాచలం లాడ్జిలో ఏం చేశారంటే?
అంతేకాదు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయమని, కలరా, ప్లేగు లాంటి వ్యాధుల నుంచి కాపాడాలని కోరుతూ 1948లో ఈ పాలజ్ గ్రామంలో గణేషుడిని ప్రతిష్టించారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం 11 రోజుల పాటు పెద్దఎత్తున గణేశోత్సవాలు నిర్వహిస్తున్నారు. కానీ నిమజ్జనం మాత్రం చేయడం లేదని అక్కడి గణపతి మండలి సభ్యులు చెప్పారు. నిమజ్జనం రోజున శోభయాత్ర నిర్వహించి కొన్ని నీళ్లు విగ్రహంపై చల్లుతామని పేర్కొన్నారు. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా విగ్రహాన్ని భద్రపరుస్తున్నామని ఇదే ఎన్నోఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
Also Read: వీడియో - ముసలోడే కానీ మహా రసికుడు.. 65ఏళ్ల మహిళతో తోటలో పాడుపని - చివరికి
ఈ విగ్రహాన్ని చూసేందుకు మహారాష్ట్రతో పాటు తెలంగాణకు చెందిన భక్తులు ఎక్కువ వస్తుంటారని చెప్పారు. అంతేకాదు వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు 11 రోజుల పాటు అన్నదానం ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే భజనలు, కీర్తనలతో పాటు ఇతర ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Also Read: షాకింగ్ వీడియో- విడాకుల విషయంలో లొల్లి.. నడిరొడ్డుపై కాల్చి చంపిన భర్త