Old Age Love Marriage: వీడియో - ముసలోడే కానీ మహా రసికుడు.. 65ఏళ్ల మహిళతో తోటలో పాడుపని - చివరికి

బిహార్‌లోని మధుబని జిల్లాలో 70 ఏళ్ల ఠకై యాదవ్, 65 ఏళ్ల జగీయా దేవికి వివాహమైన వార్త వైరల్ అవుతోంది. ఈ వృద్ధ దంపతులు 7ఏళ్లుగా అక్రమసంబంధం కలిగి ఉన్నారు. ఒకరోజు తోటలో అభ్యంతరకరమైన పరిస్థితిలో కనిపించడంతో గ్రామస్తులు వారికి పెళ్లి చేశారు.

New Update
bihar madhubani 70 year old thakai yadav marries 65 year old jagiya devi viral news (1)

bihar madhubani 70 year old thakai yadav marries 65 year old jagiya devi viral news

ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఓ వృద్ధ జంట. లేటు వయసులో ఘాటు ప్రేమ అన్నట్లు ఇద్దరూ ఒకరినొకరు గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. అచ్చం సినిమాను తలపించే వీరి ప్రేమ కథ వింటే ఒక్కొక్కరూ షాక్ అవ్వకుండా ఉండలేరు. వీరి కథలో ఒక్క యాక్షన్ సీన్లు మాత్రమే లేవు. మిగతా ఎమోషన్స్, రొమాన్స్‌తో చెలరేగిపోయారు. అవునండీ మీరు విన్నది నిజమే.. 70 ఏళ్ల వయసున్న ఒక వృద్ధుడు ఏకంగా 65 ఏళ్ల వయస్సున్న మరో వృద్ధురాలితో ప్రేమలో పడటం మీరు ఎప్పుడైనా చూశారా?. అలాంటిదే ఇప్పుడు ఒక రాష్ట్రంలో జరిగింది. 

తోటలో పాడుపని

ఈ వృద్ధ జంట గత 7 ఏళ్లుగా ప్రేమలో ఉంటూ రహస్యంగా కలుసుకుంటున్నారని ఆ ఊరి గ్రామస్తులు చెబుతున్నారు. అయితే అలా రహస్యంగా ఒక రోజు తోటలో కలుసుకుని రొమాన్స్ చేసుకుంటున్న వీరిని స్థానికులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుని పెళ్లి చేసేశారు. ఈ విషయంలో పలువురు నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఈ ఘటన బీహార్‌లోని మధుబని జిల్లాలో చోటుచేసుకుంది. 65ఏళ్ల వృద్ధురాలు జగియా దేవి భర్త 20 ఏళ్ల క్రితం దూరమయ్యాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తోంది. మరోవైపు 70 ఏళ్ల వృద్దుడైన థకై యాదవ్‌ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇలా గత కొంతకాలంగా వీరిద్ధరూ రహస్యంగా ప్రేమలో మునిగి తేలుతూ.. కలుసుకుంటున్నారు. వీరికి చెరోవైపు కన్నబిడ్డలు, మనువలు, మనుమరాళ్లు ఉన్నారు. 

అయితే వీరిద్దరిదీ వేర్వేరు కులాలు కావడంతో ఇంటికి దూరంలో తరచుగా కలుసుకుని, అక్కడే కొద్ది సేపు మాట్లాడుకోవడం వంటివి చేస్తున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం గత ఏడు సంవత్సరాలుగా కొనసాగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఊరిలోని ఓ తోటలో 70 ఏళ్ల యాదవ్, 65 ఏళ్ల జగియా దేవి అభ్యంతరకరమైన పరిస్థితిలో గ్రామస్థులకు కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య శారీరక సంబంధం రెడ్ హ్యాండెడ్‌గా బయటపడింది. వెంటనే గ్రామస్తులు ఊరి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఆ పంచాయితీలో పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. వారి నిర్ణయంతో ఈ ఇద్దరు వృద్ద లవ్ కపుల్ గ్రామస్తుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

వృద్దాప్యంలో రామ రామ, కృష్ణ కృష్ణ అనుకోవాల్సింది పోయి.. ఇలా ఇద్దరూ రహస్యంగా తోటలో అభ్యంతరకరమైన పరిస్థితిలో పట్టుబడటంతో అంతా ఒక్కసారిగా షాకవుతున్నారు. గ్రామస్తులు మాత్రం ఇప్పటి వరకు వీరిని విడిగా చూశామని.. అయితే ఇప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండటం మంచిదేనని మాట్లాడుకుంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు