Crime News: దారుణం.. మహిళతో అసభ్యప్రవర్తన.. అడ్డుకున్న విదేశీ టూరిస్టులపై దాడి!

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కొప్పళ జిల్లా గంగావతిలో ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన పర్యాటకులపై దుండగులు దాడి చేసి తుంగభద్ర ఎడమ కాలువలోకి తోసేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు టూరిస్టులు ఈదుకుంటూ ఒడ్డుకు రాగా.. మరొకరు గల్లంతయ్యారు.

New Update
foreign tourists attacked by miscreants in Gangavathi karnataka

foreign tourists attacked by miscreants in Gangavathi karnataka Photograph: (foreign tourists attacked by miscreants in Gangavathi karnataka)

భారతదేశంలో ఉన్న ప్రకృతి అందాలు, పురాతన కట్టడాలు చూసేందుకు దేశ, విదేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. పరిమలించే ప్రకృతి అందానికి మంత్రముగ్దులైపోతారు. అయితే తాజాగా కర్ణాటకలో ఉన్న అందాలను చూసేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ నుంచి కొందరు టూరిస్టులు వచ్చారు. రాత్రి కావడంతో మంచి పాటలతో సందడి చేశారు. ఈ క్రమంలో కొందరు దుండగులు వచ్చి అక్కడ ఉండే మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు.  అనంతరం అడ్డుకున్న టూరిస్టులపై దాడి చేసి పక్కనే ఉన్న కాలువలోకి పడేశారు. అందులో ఇద్దరు ఒడ్డుకు చేరుకోగా.. ఒకరు గల్లంతయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?

విదేశీ టూరిస్టులపై దాడి

అమెరికాకు చెందిన డేనియల్‌ (23), ఇజ్రాయెల్‌కు చెందిన నామా (27),  నాసిక్‌కు చెందిన పంకజ్‌(43), ఒడిశాకు చెందిన డిబాస్‌ (42) సహా ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన పర్యాటకులు కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతికి వచ్చారు. అక్కడే ఆనెగుందిలోని అంబికా నాయక్ హోస్టేలో బస చేశారు. ఇక వీరంతా సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడివద్ద  గురువారం రాత్రి సాంగ్స్, డ్యాన్సులతో సంది చేశారు. 

అదే సమయంలో కొందరు దుండగులు అక్కడికి వచ్చి టూరిస్టు మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో మరికొందరు టూరిస్టులు ఆ దుండగులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య గొడవ జరగగా.. ఆ దుండగులు మారణాయుధాలతో టూరిస్టులపై దాడి చేశారు. అనంతరం డిబాస్, పంకజ్, డేనియల్‌ను పక్కనే ఉన్న తుంగభద్ర ఎడమ కాలువలోకి తోసేశారు.  

Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!

అయితే ఆ కాలువలో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో ఇద్దరు టూరిస్టులు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చేశారు. కానీ డిబాస్ మాత్రం అందులో గల్లంతయ్యాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు