శ్రీ వారి సేవలో కర్ణాటక బిజెపి నేత సి.టి.రవి |Karnataka BJP leader C.T. Ravi in TTD |RTV
మహారాష్ట్రలో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. నాగ్‌పుర్‌లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. 7, 13 ఏళ్ల చిన్నారులకు పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు.
ఓ గుడిలో రూ.20 నోటుపై కనిపించిన వింత కోరిక అందరినీ షాక్‌కి గురిచేసింది. ‘మా అత్త త్వరగా చనిపోవాలి’ అని రాసి ఉన్న నోటును చూసి అంతా అవక్కయ్యారు. అత్త చావును కోరుకుంటోంది అల్లుడా, కోడలా అని చర్చించుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లాలో చోటుచేసుకుంది.
కర్ణాటకలోని చిక్‌మంగుళూరులో మాణిక్య ధార కొండపై ఉన్న దేవిరమ్మ జాతరకు వేలాది మందికి పైగా భక్తులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగి వందలమందికి పైగా కొండ మీద నుంచి జారి పడ్డారు. క్షతగాత్రులను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఉత్తర కన్నడ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. అంకోలా తాలూకా శిరూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి 66పై ఈ ఘటన జరిగింది. టీ స్టాల్‌పై మట్టి దిబ్బలు కూలిపోయాయి. దాన్ని నిర్వహిస్తున్న కుటుంబ సభ్యుల్లో నలుగురి మృతి చెందారు. మరో ముగ్గురి ఆచూకీ లభించాల్సి ఉంది.
కర్ణాటకలోని ఓ యువకుడు తన పెళ్లి పత్రికలో.. ప్రధాని మోదీని మరోసారి గెలిపించడమే మా జంటకు మీరు ఇచ్చే గొప్ప బహుమతి అని రాయించుకున్నాడు. దీంతో అతడి బంధువొకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కర్ణాటలోని బళ్లారిలో ఓ స్థానిక వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరుపగా.. ఏకంగా రూ.7.6 కోట్ల నగదు, బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. ప్రస్తుతం వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇలా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.