Income Tax Bill 2025: సామాన్యులకు గుడ్‌న్యూస్.. లోక్‌సభ‌లో కొత్త IT బిల్లు ఆమోదం

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో సవరించిన ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు. 1961 నాటి పాత చట్టం స్థానంలో కొత్త, IT చట్టాన్ని తీసుకురానుంది కేంద్రం.

New Update
Parliament

Modified Income Tax bill

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(FM Nirmala Sitharaman) సోమవారం లోక్‌సభ(Lok Sabha) లో సవరించిన ఆదాయపు పన్ను బిల్లు(New Income Tax Bill) ను ప్రవేశపెట్టారు. 1961 నాటి పాత చట్టం స్థానంలో కొత్త, IT చట్టాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. గతంలో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బిల్లులో కొన్ని సాంకేతిక, విధానపరమైన లోపాలు ఉన్నాయని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో ఆ బిల్లును కేంద్రం సెలెక్ట్ కమిటీకి పంపింది. పాత ఆదాయపు చట్టం ఉపసంహరిచుకొని కొత్త IT చట్టాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ బిల్లులో పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ చేసిన చాలా సిఫార్సులను ప్రభుత్వం చేర్చింది. బయ్యంత పాండా నేతృత్వంలోని ఈ కమిటీ గత నెలలో 4,500 పేజీల నివేదికను సమర్పించింది. ఇందులో మొత్తం 285 ప్రతిపాదనలను సూచించింది. పన్నుల విధానాన్ని మరింత స్పష్టంగా, సరళంగా ఉండేలా చూడటమే ఈ మార్పుల ఉద్దేశమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Also Read :  కాంగ్రెస్లో తిరుగుబాటు..కీలక మంత్రి రాజీనామా!

కొత్త బిల్లులోని ముఖ్య మార్పులు:

పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం: ఆలస్యంగా రిటర్న్‌లు దాఖలు చేసినప్పటికీ రీఫండ్‌లు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
ఆస్తి ఆదాయంపై పన్ను: ఖాళీగా ఉన్న ఆస్తులపై డీమ్డ్ అద్దె పన్నును తొలగిస్తారు. అలాగే, ఇంటి ఆస్తి ఆదాయంలో మునిసిపల్ పన్నులు తీసివేసిన తర్వాత 30% స్టాండర్డ్ డిడక్షన్‌ను వర్తింపజేస్తారు.
హోం లోన్ వడ్డీ తగ్గింపు: ఇంటి రుణంపై చెల్లించే వడ్డీకి తగ్గింపును అద్దెకు ఇచ్చిన ఆస్తులకు కూడా వర్తింపజేస్తారు.
పెన్షన్ మినహాయింపు:ఉద్యోగులు కాని వారికి కూడా కమ్యూటెడ్ పెన్షన్‌పై పన్ను మినహాయింపు కల్పించారు.
వివాదాల పరిష్కారం:పన్ను వివాదాలను తగ్గించేందుకు అస్పష్టమైన నిబంధనలను తొలగించారు.
కొత్త పన్ను కాన్సెప్ట్: 'గత సంవత్సరం', 'అసెస్‌మెంట్ ఇయర్' అనే పాత పద్ధతిని తొలగించి, 'టాక్స్ ఇయర్' అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు.

ఈ కొత్త బిల్లు ద్వారా పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా, పన్నుల వ్యవస్థ మరింత సులభతరం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెలెక్ట్ కమిటీ సూచనలు, వాటాదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ బిల్లును రూపొందించామని ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించిన తర్వాత, రాజ్యసభ ఆమోదం కోసం పంపుతారు. ఈ బిల్లు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తుందని భావిస్తున్నారు.

Also Read :  చిల్లర చేష్టలు ఆపు.. పాక్ ఆర్మీ చీప్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!

Advertisment
తాజా కథనాలు