KN Rajanna: కాంగ్రెస్లో తిరుగుబాటు..కీలక మంత్రి రాజీనామా!

కర్ణాటక రాష్ట్ర సహకార శాఖ మంత్రి కె.ఎన్. రాజన్న చేసిన  వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ ఆరోపణల విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు

New Update
rajanna

కర్ణాటక రాజకీయాల్లో(Karnataka Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది,  ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి కె.ఎన్. రాజన్న(KN Rajanna) చేసిన  వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ ఆరోపణల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పై ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలు చేయగా  రాజన్న చేసిన కామెంట్స్ ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఓటరు జాబితాలో అక్రమాలు జరిగిన మాట నిజమేనని, అయితే అవి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగాయని, అప్పుడు పార్టీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.  ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో పార్టీ విఫలమైందని విమర్శించారు.  

Also Read :  సామాన్యులకు గుడ్‌న్యూస్.. లోక్‌సభ‌లో కొత్త IT బిల్లు ఆమోదం

కర్ణాటక రాజకీయాల్లో పెద్ద సంచలనం

ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ(Congress Party), ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్(DK Shivakumar) తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో, అధిష్టానం సూచనల మేరకు రాజన్న తన రాజీనామాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు. ఆయన రాజీనామా కర్ణాటక రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది.  అయితే తాను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ, రాజన్న రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని ప్రకటించారు. తుమకూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీ) ఎన్నికలకు ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఇది రాజీనామా చేయడానికి ఒక రోజు ముందు జరిగిన పరిణామం.  రాజన్న కుమారుడు, ఎమ్మెల్సీ అయిన రాజేంద్ర కూడా తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి అందజేసినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన రాజన్న వాల్మీకి వర్గానికి చెందిన నేత. ఇటీవల హసన్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పదవి నుండి కూడా ఆయన్ను తొలగించారు. 

Also Read : ఇంత దారుణమా?.. షాకింగ్ వీడియో బయటపెట్టిన కవిత!

కాగా గతంలో కూడా కె.ఎన్. రాజన్న వివిధ సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా, తన వయస్సు, ఆరోగ్య కారణాల వల్ల తాను తదుపరి ఎన్నికలలో పోటీ చేయబోనని, కానీ రాజకీయాల్లో మాత్రం చురుకుగా ఉంటానని ప్రకటించారు. సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని పెద్ద రాజకీయ మార్పులు ఉండవచ్చని అంటూ ఇటీవల రాజన్న  చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 

Also Read :  చిల్లర చేష్టలు ఆపు.. పాక్ ఆర్మీ చీప్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!

Advertisment
తాజా కథనాలు