/rtv/media/media_files/2025/07/31/rohingya-refugees-2025-07-31-19-11-28.jpg)
First major issue whether Rohingya refugees or illegal entrants, Supreme Court
Rohingyas: భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో రోహింగ్యాలు ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు వాళ్లు చొరబాటుదారులా ? శరణార్థులా ? అని ప్రశ్నించింది. దీనిపై స్పష్టత రావాలని పేర్కొంది. ఒకవేళ రోహింగ్యాలు చొరబాటుదారులైతే వాళ్లని దేశం నుంచి బహిష్కరిస్తారా ? అంటూ అడిగింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కోటిశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Also Red: వధువుకు షాక్ ఇచ్చిన వరుడు..పెళ్లిమండపంలో శృంగార వీడియో లీక్
రోహింగ్యాలు భారత్‌లో శరణార్థులా ? లేదా చొరబాటు దారులా ?. ఇదే ఒక ప్రధాన సమస్య. వాళ్లని శరణార్థులుగా ప్రకటించేందుకు అర్హత లేదా ? అలా లేకపోతే వాళ్లకు ఎలాంటి హక్కులు, రక్షణలు ఉంటాయి ?. ఒకవేళ అక్రమ వలసదారులైతే వాళ్లని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహిష్కరించడం సరైందేనా ? దేశంలోకి వచ్చిన చొరబాటుదారులను నిరవధికంగా నిర్బంధించడం లేదా బెయిల్‌పై విడుదల చేయొచ్చా ?. కోర్టులు దీనిపై ఎలాంటి షరతులు విధించొచ్చు అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. అనంతరం పిటిషనర్ల తరఫున న్యాయవాది మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: తమ కంపెనీకి రావాలని రూ.8,750 కోట్లు ఆఫర్ చేసిన మెటా.. తిరస్కరించిన ఉద్యోగి
దేశంలో రోహింగ్యాల నిర్బంధమే కీల అంశమని తెలిపారు. వాళ్లని నిరవధికంగా కొనసాగించలేమని అన్నారు. దీంతో సుప్రీం ధర్మాసనం రోహింగ్యాలకు సంబంధించి వచ్చిన పిటిషన్లను 3 భాగాలుగా విభజించి ఆ తర్వాత విచారణ చేపడతామని వెల్లడించింది. ప్రతి బుధవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపేందుకు సమయం కేటాయిస్తామని పేర్కొంది. ఇదిలాఉండగా ఈ అంశంపై 2025 మే నెలలో కూడా సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్ టారిఫ్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!
ఆ సమయంలో భారత్‌లో ఉన్న రోహింగ్యా శరణార్థులు విదేశీ వాళ్లని తేలితే భారత చట్టం ప్రకారం తిరిగి పంపించాలని పేర్కొంది. UNHCR జారీ చేసిన ఐడీ కార్డులు కూడా వాళ్లకి ఏ విధంగా కూడా సహాయపడకపోవచ్చని చెప్పింది. మరోవైపు దేశంలో 12 రాష్ట్రాల్లో రోహింగ్యాలు ఉన్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వివరించాయి. ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో రోహింగ్యాలు ఉంటున్నట్లు పేర్కొన్నాయి. కానీ ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: 30 దేశాలపై రష్యా సునామీ విధ్వంసం.. సముద్రం పక్కనున్న భారత్ పరిస్థితి ఏంటి?
రోహింగ్యాలు ఎవరు?
రోహింగ్యాలు మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి చెందిన ముస్లిం మైనారిటీలు. అయితే వాళ్లని మయన్మార్ ప్రభుత్వం తమ దేశ పౌరులుగా గుర్తించదు. వారు బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చిన వలసదారులని మయన్మార్ వాదిస్తుంది. భారత్‌లో దాదాపు 40 000 మంది రోహింగ్యాలు ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది .