Artificial Rain: ఢిల్లీలో కృత్రిమ వర్షానికి సిద్ధం.. పూర్తయిన క్లౌడ్ సీడింగ్

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమయ్యింది. స్థానికంగా అక్కడ కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది.

New Update
First cloud seeding trial successfully Completed in some parts of Delhi for artificial rain

First cloud seeding trial successfully Completed in some parts of Delhi for artificial rain

ఢిల్లీలో ఏటా దీపావళి తర్వాత తీవ్రమైన వాయు కాలుష్యం నెలకొనడం పరిపాటిగా మారిపోయింది. మంగళవారం అక్కడ వాయు నాణ్యత సూచి (AQI) 306 గా రికార్డు అయినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) పేర్కొంది. ఈ క్రమంలోనే వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. స్థానికంగా అక్కడ కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది.

Also read: ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సు

 ఐఐటీ కాన్పూర్ నుంచి వచ్చిన ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌.. పొటాషియం అయోడైడ్‌, సిల్వర్‌ అయోడైడ్‌ లాంటి రసాయన ఉత్ర్పేరకాలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మేఘాలపై చల్లింది. దీంతో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో అక్కడ వర్షం పడే అవకాశాలున్నాయి. ఇదిలాఉండగా ఢిల్లీ సర్కార్.. నగరంలోని అయిదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సెప్టెంబర్ 25న ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం చేసుకుంది. 

 దీని ప్రకారం చూసుకుంటే అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య ఏ సమయంలోనైనా ట్రయల్స్‌ నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్  (DGCA) పర్మిషన్ ఇచ్చింది. కృత్రిమ వర్షం కోసం కావాల్సిన రూ.3.21 కోట్ల బడ్జెట్‌ను కూడా ఈ ఏడాది మే లో ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. 

Also Read: వెళ్ళినా, వచ్చినా కూడా ఫోటోలు, బయో మెట్రిక్..యూఎస్ కొత్త రూల్ అమల్లోకి..

కృత్రిమ వర్షం ఎలా పడుతుంది ?

మేఘాలలో కావాల్సినంత తేమ ఉంటుంది. కానీ వర్షం పడేందుకు అన్నివేళలా అనుకూల పరిస్థితులు ఉండవు. కృత్రిమ వర్షం కురిపించేందుకు ముందుగా శాస్త్రవేత్తలు అనువైన మేఘాలను గుర్తిస్తారు. వాటిపై పొటాషియం అయోడైడ్, సిల్వర్ అయోడైడ్ లాంటి రసాయన ఉత్ర్పేరకాలను చల్లుతారు. దీన్ని క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ అని అంటారు. ఇది మేఘాల్లో తేమను కరిగించి వర్షాన్ని కురిపిస్తుంది. అంతేకాదు కొన్నిసార్లు పొడిమంచును కూడా వినియోగిస్తుంటారు. ఇక వర్షం కురిసినప్పుడు వాయు కాలుష్యం చాలావరకు తగ్గిపోతుంది. 

Also Read: తండ్రి వెధవ పనికి కూతురు సపోర్ట్.. ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్

Advertisment
తాజా కథనాలు