Fire Accident: ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సు

ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమయ్యింది. మూడో టర్మినల్ వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగింది.

New Update
Air India bus catches fire near aircraft in Delhi Airport

Air India bus catches fire near aircraft in Delhi Airport

ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమయ్యింది. మూడో టర్మినల్ వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగింది. ట్యాక్సీయింగ్‌ ఏరియాలో నిలిపి ఉన్న విమానానికి పక్కనే ఈ ప్రమాదం జరగడం కలకలం రేపింది. ఆ  సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇది గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ఆర్పేశారు. 

Also Read: రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

బస్సు సమీపంలో ఉన్న విమానానికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. వాస్తవానికి SATS ఎయిర్‌పోర్టు సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే థర్డ్‌ పార్టీ ప్రొవైడర్‌ ఎయిరిండియాకు బస్సు సేవలు అందిస్తోంది. అయితే బస్సులో అగ్ని ప్రమాదంపై ఎయిర్‌పోర్టు అధికారులు విచారణ చేపట్టారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Also Read: ఎన్నికల ముందు వేడెక్కుతున్న బీహార్ రాజకీయాలు.. 27 మందిని బహిష్కరించిన ఆర్జేడీ

ఇదిలాఉండగా  జైపూర్-ఢిల్లీ హైవేపై మరో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నుండి జైపూర్‌కు వెళ్తున్న ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి పైగా గాయాలపాలయ్యారు. వాళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Also Read: వెళ్ళినా, వచ్చినా కూడా ఫోటోలు, బయో మెట్రిక్..యూఎస్ కొత్త రూల్ అమల్లోకి..

Advertisment
తాజా కథనాలు