New Visa Rules: వెళ్ళినా, వచ్చినా కూడా ఫోటోలు..యూఎస్ కొత్త రూల్

అక్రమ వలసల నియంత్రణ కోసం అమెరికా మరో కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. తమ దేశానికి వచ్చేవారు, వెళ్ళేవారికి ఫోటోలు తీస్తామని చెబుతోంది. గ్రీన్ కార్డు హోల్డర్లతో పాటూ అన్ని వీసాదారులకు ఈ నియమం వర్తించనుంది.

New Update
Amid curbs on H1B and student visas, more Indians are lining up for US investment visas

Amid curbs on H1B and student visas, more Indians are lining up for US investment visas

అమెరికాలో అక్రమ వలసలను అరికట్టడానికి ఇప్పటికే చాలా నియమాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు మరో కొత్త నిబంధనను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది ట్రంప్ ప్రభుత్వం. ఫెడరల్ రిజిస్టర్‌లో తాజాగా దీని గురించి ప్రచురించారు. దానిని బట్టి అమెరికాకు ఏ మార్గంలో వచ్చినా..లేదా దేశం నుంచి వెళ్ళినా వారి ఫోటోలు, డేటా సేకరణను యూస్ కస్టమ్స అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ పేకరించనుంది. ఫేక్ ట్రావెలర్లను అరికట్టేందుకు ఈ చర్య బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. డిసెంబర్ 26 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది.

ఫోటోలు, డేటా సేకరణ తప్పనిసరి..

ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ రూల్స్‌ను చాలా టైట్ చేసింది యూఎస్ హోమ్‌ల్యాండ్ ఆఫ్ డిపార్టెమెంట్. అయినా కూడా ఈ చట్టాల నుంచి చాలా మంది తప్పించుకుంటున్నారు. లూప్ హోల్స్‌ను అడ్డం పెట్టుకుని దేశంలోకి ప్రవేశిస్తున్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా చాలా మంది అమెరికాలోనే ఉండిపోతున్నారు. సరైన ఫోటోలు, పత్రాలు లేకపోవడం వలన వీరిని గుర్తించడం కష్టం అవుతోంది. దీనిని అరికట్టాలంటే అమెరికాకు వచ్చినా, వెళ్ళినా కూడా ఫోటోలతో పాటూ పూర్తి డేటాను సేకరించడం అవసరమని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. 2021లోనే ఈ కొత్త నియంత్రణలు ప్రతిపాదించగా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో సాంకేతికత ఉపయోగించి అక్రమవలసదారులకు చెక్ పెట్టనున్నారు.

మరోవైపు హెచ్ 1బీ వీసా ఫీజుల పెంపుపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే అమెరికా ప్రభుత్వంపై దావా వేసింది. 3లక్షల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) పై దావా వేసింది. ఆయన అధికార పరిధికి మించి నిర్ణయాన్ని తీసుకున్నారని అందులో ఉటంకించింది. డీసీలోని ఫెడరల్ కోర్టులో ఈ దావా ఫైల్ అయింది. కాంగ్రెస్‌ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. దీని వలన చాలా కంపెనీలు నష్టపోతున్నాయని...తక్కవు నైపుణ్యం కలవారిని నియమించుకోవాల్సి వస్తుందని చెబుతోంది. అంతేకాదు ఈ నిర్ణయం వలన హెచ్‌-1బీ ఉద్యోగులను బలవంతంగా తగ్గించుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇది వారి పెట్టుబడిదారులతో పాటు కస్టమర్‌లు, సొంత ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోందని వాదించింది. దీంతో పాటూ యూఎస్ సెనేట్లు కూడా లక్ష డాలర్ల ఫీజును ఎత్తేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తున్నారు. చట్టసభ్యులందరూ కలిసి అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. 

Also Read: GAZA: ప్రాణాలు తీస్తున్న పేలని బాంబులు..పాలస్తీనీయుల కొత్త కష్టాలు

#h1b visa rules #usa #today-latest-news-in-telugu
Advertisment
తాజా కథనాలు