Fire Accident: ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సు
ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమయ్యింది. మూడో టర్మినల్ వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగింది.
ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమయ్యింది. మూడో టర్మినల్ వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలోని మొహన్లాల్గంజ్ సమీపంలో గల కిసాన్‌పథ్ వద్ద ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్ బస్సులో సడెన్‌గా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
మధ్యప్రదేశ్‌లోని గుణలో పెను విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
నల్గొండ జిల్లా పరిధిలో ప్రైవేట్ బస్ అగ్నిప్రమాదానికి గురైంది. మిర్యాలగూడ -హనుమాన్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ తగలబడింది. కావేరి ట్రావెల్స్ బస్‌లో మంటలు చెలరేగాయి. బస్ వెనుక టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కావేరి బస్సు నెల్లూరు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్‌లో 26 మంది ప్రయాణికులున్నారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.