యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ పరిధిలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జిల్లాకు మహాకుంభమేళ అనే పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Kumbamela 2

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రయాగ్‌రాజ్‌ జిల్లా పరిధిలో ఉన్న ప్రాంతాన్ని జిల్లాగా మార్చనుంది. అంతేకాదు ఈ జిల్లాకు మహా కుంభమేళా అనే పేరు పెట్టనుంది. సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారులతో భేటీ అయిన అనంతరం దీనిపై ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్‌ జిల్లా మేజిస్ట్రేట్ ఓ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. 

Also Read: 6 ఇంజిన్లు, 295 బోగీలు, స్టేషన్ దాటాలంటే గంట సమయం.. మన ఇండియాలోనే!

జనవరిలో జరగనున్న మహాకుంభమేళాను దృష్టిలో పెట్టుకుని యోగీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. డీఎం జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం.. కొత్తగా ఏర్పాటైన ఈ జిల్లాను ఇకనుంచి మహాకుంభమేళా జిల్లాగా పిలవనున్నారు. కుంభమేళా కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు, పరిపాలన పనులను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.  

Also Read: కాశీ ఆలయంలో కేక్ కట్‌ చేసిన మోడల్‌..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నభక్తులు

మహా కుంభమేళా జిల్లాలో ఇండియన్ సివిల్ సెక్యూరిటీ సెక్షన్ 14(1) ప్రకారం.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, జిల్లా మేజిస్ట్రేట్ అలాగే అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌లను నియమించనున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే మహాకుంభమేళా 2025లో జరగనుంది. వచ్చే ఏడాది జనవరి 13న మొదలై.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ కుంభమేళకు లక్షలాది అఘోరీలు అక్కడికి చేరుకుంటారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తుంటారు. మరోవైపు ఈ మహాకుంభమేళ కార్యక్రమం కోసం యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది.   

Also Read: EVMలను హ్యాక్ చేయగలనంటూ యువకుడు సవాల్.. షాక్ ఇచ్చిన పోలీసులు

Also Read: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌.. ఇద్దరు హిందూ పూజారులు అరెస్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు