సాధారణంగా కోతులు కొట్లాడుకుంటూ ఉంటాయి. అయితే తాజాగా రెండు కోతుల మధ్య జరిగిన కొట్లాట ఏకంగా రైళ్ల రాకపోకలనే ఆపేసింది. బిహార్‌లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. రైల్వే సమస్తిపూర్ అనే రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం నెంబర్ 4 సమీపంలో రెండు కోతుల మధ్య అరటి పండు కోసం కొట్లాట మొదలైంది.
Also Read: సరిహద్దు భద్రత కోసం యాంటీ డ్రోన్ విభాగం : హోం మంత్రి అమిత్ షా
అవి అలా పోట్లాడుకుంటూ ఉండగా.. వాటిలో ఓ కోతి రబ్బరు లాంటి ఒక వస్తువు మరో దానిమీదికి విసిరింది. కానీ ఆ వస్తువులు రైల్వే ఓవర్ హెడ్ వైర్‌కు తాకింది. దీంతో అక్కడ షార్ట్‌సర్క్యూట్ అయ్యింది. ఒక తీగ తెగిపోయి ఓ రైలు బోగీపై పడిపోయింది. చివరికి ఆ రైలు నిలిచిపోయింది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ డిపార్డ్‌మెంట్ వైర్‌కు మరమ్మతులు చేసిన తర్వాత రైలు మళ్లీ అక్కడి నుంచి కదిలింది.
Also Read: ఢిల్లీలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్.. తర్వాత పూల వర్షం
ఈ కోతుల కొట్లాట వల్ల ఫ్లాట్‌ఫామ్ 4లో ఉన్న బిహార్ సంపర్క్ క్రాంతి అనే రైలు 15 నిమిషాల పాటు ఆలస్యం అయ్యింది. దీనివల్ల రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు ఈ రైల్వేస్టేషన్ సమీపంలో కోతుల బెడత కూడా ఎక్కువైంది. ఇటీవల ఓ వ్యక్తి కూడా కోతుల దాడిలో గాయపడ్డాడు. అయితే తాజాగా జరిగిన ఘటన తర్వాత సమాచారం మేరకు ఘటనాస్థలానికి వచ్చిన అటవీశాఖ అధికారులు కోతులను పట్టుకున్నారు.
Also read: అవాక్కయ్యారా.. వేలంలో రూ.23 కోట్లు పలికిన హీరోయిన్ చెప్పులు..!
Also Read: ఆన్‌లైన్‌లో స్టిక్కర్లు అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్న బాలుడు