అవాక్కయ్యారా.. వేలంలో రూ.232 కోట్లు పలికిన హీరోయిన్ చెప్పులు..! 232

అమెరికాకు చెందిన నటి, సింగర్ జూడి గర్లాండ్ ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’ సినిమాలో ధరించిన రుబీ చెప్పులు 28 మిలియన్ డాలర్లు (రూ.232 కోట్ల)కు అమ్ముడుపోయాయి. 20 ఏళ్ల కిందట చోరీకి గురైన ఈ చెప్పులు.. ఇటీవల వేలంలో ఇంతటి ధర పలకడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

New Update
Judy Garland

కొన్ని వస్తువులు చూడటానికి సాధారణంగానే ఉన్నా.. వాటి విలువ మాత్రం ఆకాశాన్నంటుతుంది. ఇప్పటి వరకు ఇలాంటివి చాలానే విన్నాం.. చూశాం కూడా. కొందరు సెలబ్రిటీలు ధరించే డ్రెస్, చేతికి పెట్టుకునే వాచ్, కళ్లకు పెట్టుకునే సన్‌గ్లాస్ ఇలా.. ప్రతీ వస్తువు చాలా ఖరీదుగా ఉంటుంది. 

ఇది కూడా చూడండి: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు

అవి చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉంటాయి. కానీ వాటి ధర తెలిసి నెటిజన్లు పిచ్చెక్కిపోతుంటారు. ఒక షర్ట్ దాదాపు వేల్ల నుంచి లక్షల్లో ఉంటడంతో అంతా ఆశ్చర్యపోతుంటారు. ముఖ్యంగా మహేశ్ బాబు, బన్నీ, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా తదితర నటీ నటుల వద్ద ఉన్న వస్తువులు చాలా ధరను కలిగి ఉంటాయి. 

అలాంటిదే తాజాగా మరొక వస్తువు ధర తెలిసి నెటిజన్లు ఖంగుతింటున్నారు. చెప్పులు ఖరీదు తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా చెప్పుల ధర రూ.వెయ్య లేదా రూ.2వేలో ఉంటుంది. బాగా ఖరీదు అయితే ఓ రూ.50 వేల నుంచి లక్ష వరకు ఉండొచ్చు. 

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

చెప్పుల ధర రూ.23 కోట్లు

ఇది కూడా చూడండి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!

కానీ రూ.232 కోట్ల విలువ గల చెప్పులను ఎప్పుడైనా చూశారా?.. అవునండీ బాబూ మీరు విన్నది నిజమే. అంతటి ధర గల చెప్పులు ఉన్నాయి. ఆ చెప్పులు ఓ నటి, సింగర్‌వి. అమెరికాకు చెందిన ప్రముఖ నటి, సింగర్ జూడి గర్లాండ్ ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’ సినిమాలో ధరించింది. ఆ చెప్పుల పేరు రుబీ. ఇటీవల ఆ చెప్పులను వేలం వేయగా.. ఏకంగా 28 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం.. రూ.232 కోట్లు) పైనే పలికాయి. అయితే 20 ఏళ్ల కిందట చోరీకి గురైన ఈ చెప్పులు.. ఇటీవల వేలంలో ఇంతటి ధర పలకడంతో అంతా సంచలనంగా మారింది. 

ఇది కూడా చూడండి: నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

ఎప్పుడు చోరీ జరిగింది?

రుబీ చెప్పులు 2005లో దొంగతనం చేయబడ్డాయి. దీంతో ఎఫ్‌బీఐ అధికారులు దీనిపై సుదీర్ఘకాలం పాటు దర్యాప్తు చేశారు. ఆఖరికి 2018లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఆపై వీటిని ఓ మ్యూజియంలో ఉంచారు. దీంతో వీటిని ఇటీవల వేలం వేయగా రికార్డ్ స్థాయిలో ధర పలికాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు