తెలివి, వినూత్న ఆలోచనలు ఉంటే సంపాధించడానికి వయసుతో సంబంధం లేదని ఓ పదిహేడేళ్ల కుర్రారు నిరుపించాడు. స్టిక్కర్స్ అమ్మి నెలకు అక్షరాల 16 లక్షలు సంపాధిస్తున్నాడు అంటే నమ్ముతా..? అది కూడా పార్ట్ టైం.. రోజుకు మూడు గంటలు వర్క్ చేసుకుంటూ రూ.16 లక్షలు ఆర్జిస్తున్నాడు ఓ మైనర్ బాలుడు. Also Read: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్..ఈ మార్గంలోనే తొలి రైలు! Yılbaşı hediyesiyle başlayan başarı hikayesi: 17 yaşındaki Caelan'ın aylık kazancı 19 bin dolar!#başarıhikayesi #girişimcilik #dijitalçizim 17 yaşındaki Caelan McDonald, annesinin hediye ettiği dijital çizim makinesi sayesinde kişiselleştirilmiş ürünle… https://t.co/yukdZYbhAM pic.twitter.com/CStWh3Z4s7 — Haber.Biz (@Duy_Turkiye) December 7, 2024 బ్రిటన్‌కు చెందిన కేలన్ మెక్‌డొనాల్డ్ రెండు సంవత్సరాల క్రితం తన తల్లి ఇచ్చిన క్రిస్ట్‌మస్ గిఫ్ట్‌తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. మెక్‌డొనాల్డ్ కాలేజ్‌కు వెళ్తూ ఆన్ లైన్‌లో బిజినెస్ రన్ చేస్తున్నాడు. తన తల్లి కరెన్ న్యూషామ్ (49) రెండు సంవత్సరాల క్రితం మెక్‌డొనాల్డ్‌కు రూ.16 వేల విలువైన డిజిటల్ డ్రాయింగ్, కటింగ్, ప్రింటింగ్ మెషీన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. దాంతో గ్లాస్, యాక్రిలిక్, వివిధ రకాల మెటల్స్‌పై అతికే, ఆకట్టుకునే బొమ్మలు వేసి వాటిని స్టిక్కర్లుగా తయారు చేయడం ప్రారంభించాడు. Also Read: రేపే అసెంబ్లీ సమావేశాలు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ సందర్భానికి తగ్గట్లు స్టిక్కర్లు తయారు చేసేవాడు మెక్‌డొనాల్డ్. వాటిని ఫేస్ బుక్‌లో సేల్స్‌కు పెడితే తెగ అమ్ముడుపోయాయి. అలా మొదలైన మెక్‌డొనాల్డ్ బిజినెస్ తనకు నెలకు లక్షలు తెచ్చిపెట్టింది. నెమ్మదిగా ఆ మైనర్ బాలుడు వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోయాడు. అతడు తయారు చేసిన స్టిక్కర్లు సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఈ కామర్స్ సంస్థల ద్వారా ప్రదర్శించేవారు. నచ్చినవారు వాటిని ఆర్డర్ పెట్టుకొని కొనేవారు. ఇలా వారానికి ఆరురోజులు, మొత్తం 16 గంటలు పని చేసి సంవత్సరానికి కోట్లు సంపాధించాడు కేలన్ మెక్‌డొనాల్డ్. Also Read: ధరణిలో మార్పులు, కొత్త ఆర్‌వోఆర్ చట్టం.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు Also Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!