/rtv/media/media_files/2025/10/18/nandurbar-accident-2025-10-18-18-15-37.jpg)
మహారాష్ట్ర(maharastra) లోని నందుర్బార్ జిల్లాలో శనివారం ఘోర విషాదం(Nandurbar Accident) చోటుచేసుకుంది. చాంద్‌శైలి ఘాట్ వద్ద యాత్రికులతో వెళ్తున్న ఓ పికప్ ట్రక్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రయాణీకులు మృతి చెందారు. మరో 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ధడ్గావ్ తాలూకాలోని అస్లి ప్రాంతం వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీపావళి సందర్భంగా ఏటా జరిగే అష్టంబ (అశ్వత్థామ) రుషి తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. యాత్రికులతో పికప్ వ్యాన్, ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో దాదాపు 25 మంది భక్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read : ఆమె శాపంతో వందేళ్లుగా ఈ గ్రామంలో దీపావళి జరగట్లేదు
Vehicle Plunges Into Valley
ఈ ప్రమాదంలో ఐదుగురు నందుర్బార్ తాలూకాలోని ఘోటానీ గ్రామ నివాసితులుగా గుర్తించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, తలోడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిన వాహనం నుంచి క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని నందుర్బార్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన వారికి తలోడా ఉప జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తుకు ఆదేశించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పండుగ వేళ జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
Also Read : పండగ వేళ వాహనదారులకు గుడ్‌న్యూస్.. NHAI కీలక ప్రకటన