/rtv/media/media_files/2025/01/22/N9aHgkdgdBVV0MEnVIgR.jpg)
500 note Photograph: (500 note )
జాగ్రత్త... మార్కెట్‌లో నకిలీ 500 రూపాయల నోట్లు పెరిగిపోతున్నాయి. కొందరు 500 రూ. (Fake 500 Rupees) విలువ చేసే నోట్లను నకిలీవి తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ఇటీవల ఓ వైన్ షాపులో కేవలం నెల రోజుల వ్యవధిలో రెండు రూ.500 నోట్లు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. బ్యాంకులో డబ్బును జమ చేసేందుకు వెళ్లినప్పుడు ఆ విషయం వెలుగులోకి వచ్చింది. కాబట్టి 500 రూపాయల నోట్లు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరి తీసుకోండి. లేకపోతే అడ్డంగా మోసపోతారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న బ్యాంకులు, ఏటీఎంలు కూడా ఈ నకిలీ నోట్లను గుర్తించలేకపోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కొత్త మార్గదర్శకాలను తప్పకుండా తెలుసుకుని పాటించాలి. నకిలీ నోట్ల బెడదను సీరియస్‌గా తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. కొత్త మార్గదర్శకాల్లో అసలు, నకిలీ రూ.500 నోట్లను ఎలా గుర్తించాలే కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.
Also Read : నడిరోడ్డులో ఆటో డ్రైవర్ దారుణ హ*త్య.. వణుకుపుట్టిస్తున్న విజువల్స్
Also Read : గోడపై మరకలను శుభ్రం చేయడానికి ఈ చిట్కాలు పాటించండి
నకిలీ నోట్లను ఎలా గుర్తించాలి?
నోటుపై 500 నంబర్ పారదర్శకంగా ఉంటుంది.
ఆర్బీఐ ముద్రించిన రూ.500 నోటు అసలు ముఖ విలువ కలిగిన నోటు దేవనాగరి లిపిలో "500" అని రాసి ఉంటుంది.
నోటు వెనుక చారిత్రక కట్టడం ఎర్రకోట ఉంటుంది.
ఎర్రకోట క్రింద స్వచ్ఛ భారత్ అభియాన్ లోగో నినాదం ఉంటుంది.
మహాత్మాగాంధీ పోరెట్రయిట్, అశోక చిలుక చిహ్నం, గుర్తింపు చిహ్నం ఎత్తు పెరిగిన ముద్ర ఉంటుంది.
అసలు నోటుపై ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది.
భారత్ అని హిందీలో, భారతదేశం ఆంగ్లంలో వ్రాయబడింది.
కుడి, ఎడమ 5 పొడవైన ఎత్తు పెరిగిన రేఖలు
నోటుపై రాసుకున్న 500 నంబర్ రంగు ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది..
పైన పేర్కొన్న లక్షణాల్లో స్వల్ప తేడా కనిపించినా ఆ నోటు నిజమైనది కాదని గుర్తించాలని ఆర్‌బీఐ ప్రజలకు సూచించింది.
Also Read : Rajasthanలో విషాదం.. అంబులెన్స్ తలుపు ఓపెన్ కాకపోవడంతో మహిళ మృతి
Also Read : బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓటీటీలో 'పుష్ప2'.. ఆ బంపర్ ఆఫర్ కూడా!