Rajasthanలో విషాదం.. అంబులెన్స్ తలుపు ఓపెన్ కాకపోవడంతో మహిళ మృతి

రాజస్థాన్‌లో అంబులెన్స్ తలుపులు ఓపెన్ కాకపోవడంతో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆ మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అక్కడ 15 నిమిషాల పాటు డోర్లు ఓపెన్ కాకపోవడం వల్లే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

New Update
Ambulance

Ambulance Photograph: (Ambulance)

రాజస్థాన్‌ (Rajasthan) లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భిల్వారా పట్టణంలో ఓ మహిళ ఇంట్లోనే ఊరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కిటికీ డోర్లు పగలగొట్టి ఆమెను ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత అంబులెన్స్ డోర్లు ఓపెన్ కాకపోవడంతో ఆ మహిళ అక్కడే మృతి చెందింది.

ఇది కూడా చూడండి: Stock Market Today: లాభాల్లో  ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర

ఇది కూడా చూడండి:OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?

అంబులెన్స్ డోర్లు ఓపెన్ కాకపోవడంతో..

దాదాపు 15 నిమిషాల పాటు అంబులెన్స్ డోర్లు ఓపెన్ కాకపోవడం వల్లే ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే అంబులెన్సు (Ambulance) ఆపరేటర్‌ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలను ఖండించారు. అంబులెన్సులోకి ఆమెను తీసుకురాక ముందే మరణించిందని, తన దగ్గర నాడి కదలిక డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని అన్నారు. దీంతో దర్యాప్తు కోసం ఓ కమిటీని వేశారు. 

ఇది కూడా చూడండి:BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!

Advertisment
తాజా కథనాలు