Hanumakonda: నడిరోడ్డులో ఆటో డ్రైవర్ దారుణ హ*త్య.. వణుకుపుట్టిస్తున్న విజువల్స్

హనుమకొండలో దారుణం ఘటన చోటుచేసుకుంది. అదాలత్ జంక్షన్ లో పట్టపగలే నడి రోడ్డుపై ఓ ఆటోడ్రైవర్ ను మరో ఆటో డ్రైవర్ పొడిచి చంపాడు. మృతుడిని మడికొండకు చెందిన రాజ్‌కుమార్ గా గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

author-image
By Archana
New Update

Hanumakonda: 

 పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ ఆటో డ్రైవర్ ను మరో ఆటో డ్రైవర్‌ అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన హన్మకొండలో సంచలనం రేకెత్తించింది.ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మడికొండ కు మాచర్ల రాజ్‌కుమార్‌ హన్మకొండలో ఆటో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. అతడిపై మరో ఆటో డ్రైవర్​ వెంకటేశ్వర్లు అదాలత్ జంక్షన్ సమీపంలోనడిరోడ్డుపై కత్తితో దాడిచేసి విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.


నడిరోడ్డుపై జనమంతా చూస్తుండగానే ఆటోడ్రైవర్‌పై మరో ఆటో డ్రైవర్‌ కత్తితో దాడి చేస్తున్నప్పటికీ చుట్టూ ఉన్న జనం నోరెళ్లబెట్టి చూస్తూ నిలబడ్డారే కానీ ఏ ఒక్కరూ కూడా అతన్ని అడ్డుకోకపోవడం గమనార్హం. మరికొంతమంది అత్యుత్సాహంతో హత్య ఘటనా దృశ్యాలను తమ మొబైల్‌లో చిత్రీకరిస్తూ నిలబడ్డారు. మానవత్వాన్ని మరిచి మర మనుషుల్లా నిలబడి చూస్తున్న జనాన్ని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.


నిత్యం రద్దీతో ఉండే హైదరాబాద్ - వరంగల్ ప్రధాన రహదారి హైవే మీద గల అదాలత్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ రాజ్‌కుమార్‌ను ప్రత్యర్ధి ఆటో డ్రైవర్‌ వెంకటేశ్వర్లు దారుణంగా పొడిచి హత్య చేశాడు. సెంటర్లో రాజకుమార్‌ ఆటోలో కూర్చుని ఉన్న సమయంలో మరో డ్రైవర్‌ ఏనుగు వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకున్నాడు. రావడంతోనే తన వద్ద ఉన్న కత్తితో రాజ్‌కుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. అలా ఒకటికాదు రెండు కాదు ఏకంగా 15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో రాజ్‌కుమార్‌ కిందపడిపోయినప్పటికీ వదలకుండా పొడుస్తూనే ఉన్నారు. చివరకు గొంతులో కూడా కత్తితో పొడవడంతో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాజ్‌కుమార్‌ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత వెంకటేశ్వర్లు అక్కడినుంచి పారిపోయాడు.  స్థానికులు వెంకటేశ్వర్లును పట్టుకునే ప్రయత్నం చేయగా వారిని కత్తితో బెదిరిస్తూ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

  హత్యకు ఒక మహిళ కారణమన్న ప్రచారం సాగుతోంది. ఆ మహిళ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదమే హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సదరు మహిళతో రాజ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ విషయంలోనే ఇద్దరి మధ్య వివాదం ముదిరి హత్య వరకు వెళ్లినట్లు భావిస్తున్నారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే సుబేదారి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా హత్యకు పాల్పడిన నిందితుడు నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు