Pushpa2: బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓటీటీలో 'పుష్ప2'.. ఆ బంపర్ ఆఫర్ కూడా!

పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నెల 28 లేదా 31న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

New Update

Pushpa 2:  డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప2' ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. విడుదలైన 32 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు గ్రాస్‌ రాబట్టి 'బాహుబలి2' రికార్డును బ్రేక్ చేసింది. ఇండియా సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రెండవ స్థానంలో నిలిచింది.  అమీర్ ఖాన్ 'దంగల్' రూ. 2వేల కోట్లతో మొదటి స్థానంలో ఉంది. మరోవైపు బాలీవుడ్ లో  రూ.806 కోట్లు గ్రాస్‌ వసూళ్లు చేసి నంబర్‌ 1 స్థానంలో నిలిచింది.

AAPSRTC: కుంభమేళా వెళ్లేవారికి ఏపీ ఆర్టీసీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే 7రోజుల ప్యాకేజ్ !

ఓటీటీలోకి పుష్ప 2.. 

ఇది ఇలా ఉంటే పుష్ప2 ఓటీటీ విడుదలకు రంగం సిద్దమైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనెల 28 లేదా 31న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫ్యాన్స్ కి మరో అదిరిపోయే వార్త కూడా ఉంది.  ఓటీటీలో 3 గంటల 40 నిమిషాల నిడివితో ఉన్న రీలోడెడ్ వెర్షన్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందట.  

Also Read: Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు