TN Stampede: తొక్కిసలాటకు అసలు కారణం ఇదే.. షాకింగ్ నిజాలు చెప్పిన డీజీపీ!

తమిళనాడు కరూర్‌లో సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 38 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.

New Update
vijay stamped

తమిళనాడు(Tamil Nadu) కరూర్‌లో సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీ(TVK chief Vijay rally) లో జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 38 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. సుమారు 65 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు విజయ్ పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు ఆదేశించారు. ఈ దారుణ సంఘటనకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని డీజీపీ తెలిపారు. 

ఆరు గంటల ఆలస్యం, భారీ జన సందోహం:

ఈ ర్యాలీకి కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతి తీసుకున్నప్పటికీ, దాదాపు 30,000 నుండి 60,000 మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. మొదట విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని ప్రకటించినా, ఆయన దాదాపు 6 గంటలు ఆలస్యంగా రాత్రి 7 గంటల తర్వాత వచ్చారు. ఇంత మంది జనం చిన్న ప్రాంతంలో, ఎక్కువ సమయం వేచి ఉండటం వలన తొక్కిసలాటకు దారితీసింది.

Also Read :  విజయ్ ర్యాలీ.. ఘటనపై స్పందించిన నేతలు

భద్రతా లోపాలు, విద్యుత్ నిలిపివేత:

జన సమూహాన్ని నియంత్రించడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం, భద్రతా సిబ్బంది కొరత తీవ్రంగా కనిపించింది. విజయ్(Vijay Dalapathy) ప్రసంగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రాంతమంతా చీకటిగా మారి గందరగోళం చెలరేగింది. భయాందోళనతో జనం ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. రద్దీ కారణంగా అంబులెన్స్‌లు సైతం ప్రమాద స్థలానికి చేరుకోవడం కష్టమైంది.

Also Read :  విజయ్‌ సభలో తొక్కిసలాట.. 30 మంది మృతి.. స్పాట్‌లో ..

తొక్కిసలాట మృతుల సంఖ్య పెరుగుదల:

తొక్కిసలాట కారణంగా ఊపిరాడక చాలా మంది స్పృహతప్పి పడిపోయారు. ఈ విషాదంలో 38 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల్లో 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, విచారణకు ఆదేశించారు. ఈ సంఘటనపై టీవీకే పార్టీ నిర్వాహకులపై, ముఖ్యంగా కరూర్ జిల్లా కార్యదర్శిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటనపై నటుడు విజయ్ "నా గుండె ముక్కలైంది" అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు