/rtv/media/media_files/2025/11/09/ec-2025-11-09-17-28-57.jpg)
Election commission warns BLOs against violating rules on form distribution in West Bengal
పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో బూత్ లెవర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బూత్ లెవెల్ అధికారులకు (BLO) కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇంటింటికి వెళ్లి ఫార్మ్స్ పంపిణీ చేయకుండా కేవలం టీ స్టాళ్లు, క్లబ్బులు, ఇతర ప్రదేశాల నుంచి ఫార్మ్స్ ఇవ్వడం వల్ల 8 మంది బీఎల్‌ఓలకు ఈ నోటీసులు పంపించింది.
Also Read: బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు.. అత్యాచారం, కిడ్నాప్ సెక్షన్లు!
మొత్తంగా బెంగాల్‌లో అన్ని జిల్లా ఎన్నికల అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. BLOలు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు పంపిణి చేయాలని.. వాటిని తిరిగి సేకరించాలని చెప్పింది. బీహార్ మోడల్‌ను పాటించాలని సూచించింది. ఒకవేళ అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
Also Read: పాకిస్థాన్ సంచలన నిర్ణయం.. అసీమ్ మునీర్‌కు మరిన్ని అధికారాలు
అంతేకాదు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపింది. అలాగే ప్రతి 10 బూత్‌లకు కూడా ఓ బీఎల్‌ఓ సూపర్‌వైజర్‌ను నియమించాలని ఆదేశించింది. దీనికి అదనంగా ఓటర్ల ఫిర్యాదులను స్వీకరించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్‌ను కూడా ప్రారంభించింది.
Also Read: పశ్చిమబెంగాల్‌లో మరో దారుణం..అమ్మమ్మ ఒడినుంచి చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై....
Follow Us