/rtv/media/media_files/2025/10/06/rape-2025-10-06-21-13-39.jpg)
rape
West Bengal : పశ్చిమబెంగాల్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మానవ మృగాళ్లు రెచ్చిపోయాయి. అభం శుభం తెలియని పసిబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాయి. అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హుగ్లీలో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.
వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ లోని తారకేశ్వర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో బాధిత కుటుంబం ఆశ్రయం ఉంటుంది. శుక్రవారం రాత్రి నాలుగేళ్ల చిన్నారి తన అమ్మమ్మ వద్ద నిద్రించింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి పాపను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున నిద్ర లేచిన కుటుంబానికి బిడ్డ కన్పించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. పాప కోసం గాలిస్తుండగా రైల్వేస్టేషన్ పక్కన ఉన్న డ్రెయిన్‌లో రక్తపుమడుగులో పడిఉండటాన్ని గుర్తించారు. దీంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించి అనంతరం డిశ్చార్జ్ చేశారు. అయితే, చిన్నారికి తీవ్ర రక్తస్రావమైనప్పటికీ ఆస్పత్రి సిబ్బంది కేసును తప్పుదారి పట్టిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. తమను అక్కడి నుంచి పంపించేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదంలో దుమారం చెలరేగింది. దీంతో పోలీసులు వైద్య పరీక్షల కోసం చిన్నారిని మరోసారి ఆస్పత్రికి తరలించారు. అనంతరం దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ‘తారకేశ్వర్‌లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లిన చిన్నారిని మరోచోటుకి పంపించారు. స్థానిక పోలీసులు నేరాన్ని కప్పిపుచ్చడంలో బిజీగా ఉన్నారు. సీఎం మమతా బెనర్జీ అందిస్తున్న గొప్ప పాలన ఇది. చిన్నారి జీవితం ఛిన్నాభిన్నమైంది. అయినప్పటికీ.. నిజాన్ని కప్పిపుచ్చేందుకు పోలీసులు ఇంకా ప్రయత్నిస్తున్నారు. వారు అధికారులా.. సీఎం మద్దతుదారులా?’ అని బీజేపీ నాయకుడు సువేందు అధికారి ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే రామేందు సింఘా రాయ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. చిన్నారిపై అత్యాచారం జరగడం విచారకరమన్నారు. ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించాల్సిన రైల్వే పోలీసుల భద్రతా వైఫల్యం కారణంగానే ఇది జరిగిందని తీవ్రంగా దుయ్యబట్టారు. చిన్నారికి వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు.
Also Read : సీఎం..నీ వీధి రౌడీ భాష మార్చుకో!..కవిత మాస్ వార్నింగ్
Follow Us