Vice President Poll: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. ఆ రోజే పోలింగ్

ఇటీవల జగ్‌దీప్‌ దన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి తాజాగా షెడ్యూల్‌ విడుదలైంది. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనునుంది.

New Update
Vice President

Vice President

ఇటీవల జగ్‌దీప్‌ దన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి తాజాగా షెడ్యూల్‌ విడుదలైంది. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఆగస్టు 7న ఈ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 21 తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ పరిశీలన 22వ తేదిన జరగనుంది. ఇక ఆగస్టు 25వ తేదీలోపు నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.    

Also Read: రేపే పీఎం కిసాన్.. ఈ పని చేయకపోతే డబ్బులు రావు.. అన్నదాతలకు అలర్ట్!

పోలింగ్‌ రోజునే కౌంటింగ్‌ కూడా జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేవి భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం నిర్వహించే ఎన్నిక. ఇది రాష్ట్రపతి ఎన్నికతో చూస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎలక్టోరల్‌ కాలేజీ తరఫున లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన, అలాగే నామినేట్ చేయబడిన సభ్యులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఎమ్మెల్యేలకు ఇందులో ఓటు హక్కు ఉండదు. ఓటు వేసే వారు ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులను 1,2,3 ప్రాధాన్యత క్రమంలో గుర్తిస్తారు. రహస్య బ్యాలెట్‌ ద్వారా ఈ ఓటింగ్ అనేది నిర్వహిస్తారు.

అర్హతలు

ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే భారత పౌరుడై ఉండాలి. కనీసం 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అర్హత కూడా ఉండాలి. అలాగే లాభదాయక పదవిలో ఉండకూడదు. రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో నియమించబడతారు. అయితే నామినేషన్, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్‌ ఇలా మొత్తం ప్రక్రియన 32 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్టికల్‌ 66 పేర్కొంది. 

Also Read: పాక్, బంగ్లాపై ట్రంప్ టారిఫ్‌ మినహాయింపు.. భారత్‌పై అమెరికా కుట్ర!

ఇదిలాఉండగా ఇటీవల పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజునే జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల వల్లే తాను రాజీనామా చేసినట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ పంపారు. 2022 ఆగస్టు 11న ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2027 వరకు ఆయన పదవీకాలం ఉంది. కానీ రెండేళ్ల 244 రోజులకే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ధన్‌ఖడ్‌ తర్వాత ఆయన స్థానంలో కొత్త ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో ఎన్నిక ప్రక్రియ కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

vice-president | telugu-news | rtv-news | parliament | latest-telugu-news | national news in Telugu

Advertisment
తాజా కథనాలు