ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో పండిన బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేస్తున్నారు. అందులో భాగంగా 12,500 టన్నుల బియ్యం తొలివిడత కాకినాడ పోర్ట్‌నుంచి షిప్‌లో బయలుదేరుతున్నాయి. సోమవారం సివిల్ సప్లైయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి షిప్‌ను ప్రారంభించనున్నారు.

New Update
elangana exports

elangana exports Photograph: (elangana exports)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పండిన బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేస్తోంది. ఎంటీయూ 1010 రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్ కి ఎగుమతి చేయడానికి తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకున్నారు. ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. తొలి విడతగా 12, 500 టన్నులు బియ్యం కాకినాడ పోర్టు నుంచి షిప్ ద్వారా పంపించడానికి లోడింగ్ చేయనున్నారు. అయితే, సోమవారం బియ్యంతో ఆ షిప్ బయలు దేరనుంది. ఫిలిప్పీన్స్ కి బియ్యం లోడ్ తో వెళ్తున్న షిప్‌ను జెండా ఊపి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. 

రెండో విడతలో మరో 12,500 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు సివిల్​సప్లయ్​డిపార్ట్​మెంట్​తాజాగా నిర్ణయం తీసుకోగా.. జిల్లాల వారీగా టార్గెట్ పెట్టలేదు. అయితే.. 2022– -23 యాసంగి సీజన్​లో టెండర్​వడ్లకు సంబంధించిన మిల్లులకు అప్పగించాల్సిన బకాయిలపై లెక్కలు తీస్తున్నారు.  జిల్లాల వారీగా ఎంత పంపాలనే టార్గెట్​ఇంకా నిర్దేశించలేదు. గతేడాది రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఫిలిప్పీన్స్ అధికారులతో బియ్యం ఎగుమతిపై చర్చించారు.   ఇవి పూర్తి కాగానే జిల్లాల వారీగా కేటాయింపు జరుగుతాయని సివిల్​సప్లై అధికారులు తెలిపారు.

Advertisment