Challans: వాహనదారులకు కేంద్రం బిగ్‌షాక్.. ఐదుకు మించి చలాన్లు ఉంటే లైసెన్స్ రద్దు

ఒక వాహనంపై ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లయితే, సంబంధిత రవాణా అధికారులు ఆ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు  చేయవచ్చు. చలాన్ చెల్లించడానికి ఉన్న గడువును ప్రస్తుతం ఉన్న 90 రోజుల నుండి 45 రోజులకు తగ్గించారు.

New Update
telangana

వాహనదారులకు కేంద్రం బిగ్‌షాక్ ఇచ్చింది. ట్రాఫిక్‌ రూల్స్(traffic-rules) మరింత కఠినతరం చేసింది. కొత్త ట్రాఫిక్ రూల్స్ ముసాయిదాను విడుదల చేసింది కేంద్ర రవాణా శాఖ.  ఒక వాహనంపై ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు(traffic-challans) పెండింగ్‌లో ఉన్నట్లయితే, సంబంధిత రవాణా అధికారులు ఆ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు  చేయవచ్చు. చలాన్(e-challans) చెల్లించడానికి ఉన్న గడువును ప్రస్తుతం ఉన్న 90 రోజుల నుండి 45 రోజులకు తగ్గించారు.  45 రోజుల్లోగా చలాన్ చెల్లించకపోతే, అధికారులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది.

Also Read:  Rohit Sharma : ముందే ఊహించాడు.. 13 ఏళ్ల కిందే చెప్పేశాడు... రోహిత్ పాత ట్వీట్ వైరల్!

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే

45 రోజుల్లో చలాన్లు చెల్లించకుంటే వాహనంపై అన్ని రకాల లావాదేవీలు క్లోజ్ చేస్తారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే 3 రోజుల్లో ఎలక్ట్రానిక్ చలాన్‌ జారీ చేయనున్నారు పోలీసులు. సాధారణంగా చలాన్లు వాహన యజమాని పేరు మీదే జారీ అవుతాయి. అయితే, చలాన్ జారీ అయిన సమయంలో వాహనాన్ని యజమాని నడపలేదని నిరూపించినట్లయితే, ఆ సమయంలో వాహనం నడిపిన వ్యక్తిని బాధ్యుడిని చేస్తారు. ఈ కఠిన నిబంధనలు రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి, ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించేలా చేయడానికే జారీ చేశారు.  

Also Read : BREAKING: ఎయిర్ ఇండియా ఫ్లైట్ ల్యాండింగ్‌లో తెరుచుకున్న ఎమర్జెన్సీ ఇంజన్

కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే దిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. [email protected] కు ఈ-మెయిల్‌ కూడా చేయొచ్చని స్పష్టం చేసింది. కాగా  తెలంగాణలో జరుగుతున్న అధికశాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగంగా డ్రైవ్​ చేయడమనేది ఓ ప్రధాన కారణమని తేలింది. స్పీడ్​ లిమిట్​నిర్దేశించినప్పటికీ చాలామంది వాహనం నడిపే వారు వాటిని పాటించట్లేదు. గత ఏడాది ఏకంగా 11.31 లక్షల ఓవర్​ స్పీడ్​ కేసులు నమోదయ్యాయి. 25 వేల 971 మంది అన్నిరకాల రోడ్డు ప్రమాదాల్లో బాధితులు అయ్యారు.

Also Read :  Pak occupied Kashmir: POKతో డీల్ కుదుర్చుకున్న పాకిస్తాన్.. రాత్రికి రాత్రే వాళ్లతో సంతకాలు!

Advertisment
తాజా కథనాలు