VIRAL NEWS: షాకింగ్.. మద్యం మత్తులో డ్రైవర్, కండక్టర్.. మృత్యువు అంచుల్లో 37 మంది ప్రయాణికులు

మహారాష్ట్రలో దారుణం జరిగింది. అకోట్ డిపో నుండి వార్కారీకి వెళ్తున్న ప్రభుత్వ బస్సులో డ్రైవర్, కండక్టర్ మద్యం మత్తులో ఉన్నారు. బస్సు అదుపుతప్పుతుండటంతో 37 మంది ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

New Update
drunk driver conductor in maharashtra government bus 37 passengers lives at risk

drunk driver conductor in maharashtra government bus 37 passengers lives at risk

ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన ఆర్టీసీ సేవలు కొన్నిసార్లు నిర్లక్ష్యానికి, ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ మద్యం మత్తులో విధులకు హాజరవడంతో బస్సులోని 37 మంది ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. 

Also Read: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!

డ్రైవర్, కండెక్టర్ మద్యం తాగి

బీడ్ జిల్లాలో MH-14-6140 నంబర్ గల బస్సు 37 మంది ప్రయాణికులతో అకోట్ డిపో నుండి వార్కారీకి వెళ్తుంది. బస్సు డ్రైవర్ సంతోష్ రహతే, కండక్టర్ సంతోష్ ఝలతే డ్యూటీ సమయంలో మద్యం సేవించి ఉన్నారు. దారిలో డ్రైవర్ బస్సును సరిగ్గా నడపలేకపోతున్నాడని.. కండక్టర్ తన సీటుపై పడుకుని ఊగుతున్నాడని ప్రయాణికులు గమనించారు. దీంతో అనుమానం వచ్చి వారు వెంటనే అప్రమత్తమై బస్సును ఆపాలని డ్రైవర్‌ను డిమాండ్ చేశారు. 

అనంతరం బీడ్ రవాణా శాఖకు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో బీడ్ రవాణా శాఖ అధికారులు, స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఇద్దరూ మద్యం సేవించినట్లు అంగీకరించారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య నివేదిక అందిన తర్వాత వారిపై సస్పెన్షన్, తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

Also Read:ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!

మద్యం సేవించి విధులకు హాజరై, 37 మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసిన డ్రైవర్, కండక్టర్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రజా రవాణా సిబ్బంది నిర్లక్ష్యంపై, మహారాష్ట్ర రాష్ట్ర రవాణా శాఖ పర్యవేక్షణ లోపంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

Also Read:మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు