Drugs: ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా.. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళ కొకైన్ క్యాప్సుల్స్‌ని రూపంలో పొట్టలో పెట్టి శాస్త్ర చికిత్స చేయించుకున్నారు. రూ.21 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు బ్రెజిలియన్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. కొకైన్‌ను భారత్‌లోకి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు బ్రెజిలియన్లను అరెస్ట్ చేశామని కస్టమ్స్ విభాగం తెలిపింది.
ఇది కూడా చదవండి: రాత్రి స్వెట్టర్ వేసుకుని నిద్రపోతే ఈ సమస్యలు తప్పవు
భారీ కొకైన్ స్వాధీనం:
పారిస్ మీదుగా దేశంలోకి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. విచారణ తర్వాత ఇద్దరు ప్రయాణికులు కొన్ని మత్తు పదార్థాలతో కూడిన క్యాప్సూల్స్ , ట్యాబ్లెట్స్‌ని తీసుకున్నట్లు అంగీకరించారు. నిందితులను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లిన అధికారులు కడుపులోంచి క్యాప్సుల్స్‌ని బయటికి తీశారు. వ్యక్తి కడుపులో 105 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 937 గ్రాముల కొకైన్ లభించింది.
ఇది కూడా చదవండి: తిరుపతిలో ఘోర ప్రమాదం..భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్ ఇద్దరు భక్తులు మృతి
మహిళ కడుపులోంచి 562 గ్రాముల కొకైన్‌తో కూడిన మొత్తం 58 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం 1,399 గ్రాముల మాదక ద్రవ్యాల మార్కెట్ విలువ సుమారు రూ.20.98 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. మహిళతో పాటు మరో ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎన్‌డీపీఎస్ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఏపీలో అగ్ని ప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవ దహనం
ఇది కూడా చదవండి: ఈ ఐదుగురు బొప్పాయిని అస్సలు తినకూడదు..ఎందుకో తెలుసా..?