/rtv/media/media_files/V9tOy6dA8Fgsax9tC7Z8.jpg)
Road Accident tirupathi Photograph
AP Crime: తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. చంద్రగిరి మండలం నరశింగాపురం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులంతా అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ్మ, శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మగా గుర్తించారు.
శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా..
వీరు పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేసుకుంటూ వస్తుండగా ఈ దారుణం జరిగింది. 108 అంబులెన్స్ మదనపల్లి నుంచి తిరుపతి రూయా ఆస్పత్రికి రోగిని తీసుకొస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: బెల్లీ ఫ్యాట్ కరిగించే చిట్కాలు