AP Crime: ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. బాపట్ల జిల్లా పర్చూరు తూర్పు బజార్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇల్లు దగ్ధం కాగా.. ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నాగమణి (35), మాధవీలత (28)గా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు... గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు మహిళలు సజీవ దహనం: ఇది కూడా చదవండి: తిరుపతిలో ఘోర ప్రమాదం..భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్ ఇద్దరు భక్తులు మృతిస్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో మంటలు చెలరేగడంతో చుట్టు పక్కల వారు గమనించి కేకలు వేశారు. మరికొందరూ భయాందోళనకు గురయ్యారు. కొందరు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం కావడం.. ఇద్దరూ మహిళల సజీవ దహనంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: చలికాలంలో వేరుశెనగ తిన్నాక ఈ పొరపాటు చేయొద్దు