/rtv/media/media_files/2025/01/20/IzwsZEZ86kKRLAOXwJP3.jpg)
neeraj
రెండుసార్లు ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న భారతస్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నీరజ్ హిమాని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అతడి పెళ్లి వేడుకగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నీరజ్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించాను.
Also Read: Khammam: అన్న వాట్సాప్‌కు తమ్ముడి న్యూడ్ ఫోటోలు..RTV చేతిలో సూసైడ్ నోట్!
మీ అందరి ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు' అని ఆ ఫొటోల కింద రాసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నీరజ్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సెలబ్రిటీలు, అథ్లెట్లు నీరజ్‌కు కంగ్రాజ్యులేషన్స్ చెప్తున్నారు. అయితే నీరజ్ సతీమణి హిమాని అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నట్లు తెలుస్తుంది.
AlsoRead: Trump swearing-in ceremony: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం విశేషాలేంటో తెలుసా ?
నీరజ్ పెళ్లిచేసుకున్నఅమ్మాయి ఎవరంటే..
నీరజ్ సతీమణి హిమాని మోర్ హరియాణాకు చెందిన కుటుంబం. ఆమెకు చిన్నప్పటి నుంచి టెన్నిస్‌పై ఆసక్తి ఎక్కువ. ఆమె ఢిల్లీ యూనివర్సీటీలో ఉన్నప్పుడు మంచి టెన్నిస్ ప్లేయర్. ఆ తర్వాత హిమాని అమెరికా న్యూ హాంప్‌షైర్‌లోని ఫ్రాంక్లిన్ పియర్స్ విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది. అలాగే ఇసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి హిమాని మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది.
కాగా, భారత్ తరఫున నీరజ్ రెండుసార్లు ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్నాడు. 2020 టోక్యోలో స్వర్ణం నెగ్గిన నీరజ్, గతేడాది పారిస్ వేదికగా జరిగిన విశ్వ క్రీడల్లో రజత పతకం దక్కించుకున్నాడు.
Also Read: Amit Shah: వైసీపీ విధ్వంసానికి చింతించకండి.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
Also Read: Mukesh AMbani: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు విందులో పాల్గొన్న ముఖేశ్ అంబానీ దంపతులు