/rtv/media/media_files/2025/01/19/DCeDkVeosWnt8SRWKkl1.jpg)
Trump
జనవరి 20న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజధాని వాషింగ్టన్‌లో దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాలో విపరీతంగా చలి ఉంది. దీంతో బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ రోటుండా లోపల ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే నగరంలో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇండోర్‌లో ప్రమాణ స్వీకారం జరగడం వల్ల గతంలోలాగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరుకాలేరు. కానీ పలువురు ప్రముఖులు, దేశాధినేతలు మాత్రం హాజరుకానున్నారు.
Also Read: కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రాణ భయంతో భక్తుల పరుగులు!
చైనా తరపున అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ టీమ,ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జపాన్ విదేశాంగ శాఖ మంత్రి తకేషి ఇవాయా, హంగేరియన్ ప్రధాని విక్టర్ ఓర్బన్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, ఇంగ్లండ్ మాజీ అధ్యక్షుడు నిగెల్ పాల్ ఫారేజ్, మాజీ బ్రెజిలియన్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తదితరులు పాల్గొననున్నారు. అలాగే టెస్లా సీఈవో ఇలాన్ మస్క్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ , ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టిక్ టాక్ సీఈవో షౌ జి చెవ్ సైతం ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.
Also Read: 'నా కొడుకుకి మరణశిక్ష విధించండి': సంజయ్ రాయ్ తల్లి
మరోవైపు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆహ్వానం రాలేదు. కానీ ప్రమాణం తర్వాత పుతిన్‌తో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ కార్యక్రమానికి రావడం లేదు. ఇక ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు ఆహ్వానం వెళ్లిందా? లేదా ? అనేదానిపై క్లారిటీ లేదు. అంతేకాదు మజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలుస్తోంది. వాస్తవానికి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు, వాళ్ల భార్యలు రావడం సంప్రదాయంగా వస్తోంది.
ఇదిలాఉండగా శనివారం సాయంత్రమే ట్రంప్ వాషింగ్టన్‌కు చేరుకున్నారు. అయితే ప్రమాణ స్వీకారం రోజున వాషింగ్టన్‌లో మైనస్ 11 డిగ్రీల సెల్సియస్ చలి తీవ్రత ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్.. క్యాపిటల్ రోటుండా లోపల ప్రమాణం చేయనున్నారు. మరోవైపు వాషింగ్టనలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 30 మైళ్ల పరిధిలో తాత్కాలిక కంచెను ఏర్పాటు చేశారు. 25 వేల మంది భద్రతా సిబ్బంది మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు.