మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు ఖరారైపోయింది. మహారాష్ట్రలో బీజేపీ పెద్ద పార్టీగా అవతరిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆ పార్టీకి చెందిన నేతకే సీఎం కుర్చీ ఇస్తారని.. ఇక్కడ కూడా బీహార్ మోడల్ రిపీట్ అవుతుందనే చర్చలు నడుస్తున్నాయి. By B Aravind 23 Nov 2024 | నవీకరించబడింది పై 23 Nov 2024 17:48 IST in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు ఖరారైపోయింది. ప్రస్తుతం 220కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు మహా వికాస్ అఘాడి 55 స్థానాలకే పరిమితమైపోయింది. దీంతో మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు మొదలుపెట్టింది. సీఎం రేసులో శివసేన నేత ఏక్‌నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. వీళ్లిద్దరిలో ఎవరు సీఎం అవుతారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. Also Read: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు? ప్రస్తుతం బీజేపీ 128 అత్యధిక స్థానాల్లో కొనసాగుతోంది. ఆ తర్వాత షిండే వర్గానికి చెందిన 53 మంది అభ్యర్థులు, ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గానికి 36 మంది అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఓవైపు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని బీజేపీ నేతలు చెబుతుండగా.. షిండేనే సీఎంగా కొనసాగుతారని ఈయన వర్గం సభ్యులు చెబుతున్నారు. తాజాగా షిండే కూడా సీఎం మార్పు ఉండకపోవచ్చని తెలిపారు. దీంతో సీఎం ఎవరు అనేదానిపై మరింత ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్రలో బీజేపీ పెద్ద పార్టీగా అవతరిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆ పార్టీకి చెందిన నేతకే సీఎం కుర్చీ ఇస్తారని.. ఇక్కడ కూడా బీహార్ మోడల్ రిపీట్ అవుతుందనే చర్చలు నడుస్తున్నాయి. బీహార్‌లో 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష ఆర్జేడీ 75 సీట్లు గెలుచుకుంది. కాగా, బీజేపీ 74 సీట్లతో రెండో పార్టీగా నిలిచింది. జేడీయూ మూడో పార్టీగా అవతరించింది. అయినప్పటికీ నితీష్ కుమార్‌ను సీఎం చేసేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. తక్కువ సీట్లు వచ్చిన షిండేకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయని పలువురు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Also Read: అన్న మెజార్టీని దాటిన ప్రియాంక.. వయనాడ్‌లో సంచలనం! ఫడ్నవీస్ కు కూడా ఛాన్స్? మరోవైపు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు కూడా సీఎం పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని మహాయుతి కూటమి ప్రకటించలేదు. ఫలితాల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే షిండే హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లి ప్రచారం చేశారనే వాస్తవం కూడా ఉంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు, శివసేన-ఎన్సీపీ హైకమాండ్‌ల సమ్మతితో సీఎం అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. Also Read: Priyanka Gandhi: అన్న మెజార్టీని దాటిన ప్రియాంక.. వయనాడ్‌లో సంచలనం! Also Read: Maha Vikas Aghadi: మహా వికాస్ అఘాడి చేసిన ఈ తప్పులే ఓటమికి కారణం.. #maharashtra #telugu-news #eknath-shinde #national-news #devendra fadnavis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి