BIG BREAKING: ఎయిర్ ఇండియాకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన డీజీసీఏ!

విమానాల్లో భద్రత, సిబ్బంది వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఎయిరిండియాకు డీజీసీఏ నాలుగు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. క్యాబిన్‌ సిబ్బంది విశ్రాంతి, శిక్షణా నిబంధనలు, నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించి ఉల్లంఘనలు జరిగినట్లు ఎయిరిండియా ఒప్పుకుంది.

New Update
Air India flight

Air India

ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం యావత్తు భారత్‌ను కలచివేసింది. ఇప్పటికీ ఆ ప్రమాదం నుంచి కొందరు బయటపడలేకపోతున్నారు. ఈ భయంతో ఇప్పటికీ చాలా మంది విమాన ప్రయాణాలు చేయాలంటే ఆలోచిస్తున్నారు. అయితే అహ్మాదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటన తర్వాత డైరెక్టరైట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) కీలక చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

ఇది కూడా చూడండి:Mumbai train blasts case: ముంబై రైలు పేలుళ్ల ఘటన.. 12 మంది నిర్దోషుల తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

ఇది కూడా చూడండి:Hari Hara Veeramallu:  హరిహర వీర మల్లుకు చంద్రబాబు అభినందనలు..ఎన్నాళ్లనుంచో అంటూ...

భద్రత, సిబ్బంది వ్యవహారాలపై..

విమానాల్లో భద్రత, సిబ్బంది వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఎయిరిండియాకు డీజీసీఏ నాలుగు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. క్యాబిన్‌ సిబ్బంది విశ్రాంతి, శిక్షణా నిబంధనలు, నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించి ఉల్లంఘనలు జరిగినట్లు ఎయిరిండియా ఒప్పుకుంది. అయితే గత ఆరు నెలల్లో ఎయిరిండియాకు తొమ్మిది షోకాజ్ నోటీసులు జారీ చేశారు. భద్రతా ఉల్లంఘనల కారణంగానే జారీ చేసినట్లు ఇటీవల పౌరవిమానయాన శాఖ తెలిపింది.

ఇది కూడా చూడండి:11 ఏళ్ల బాలికపై అత్యాచారం, 53 ఏళ్ల నిందితుడు జువైనల్‌ బోర్డుకు తరలింపు..

Advertisment
తాజా కథనాలు