RP Sisodia: వరదొస్తుందని ముందే తెలుసు..సిసోడియా సంచలన వ్యాఖ్యలు
AP: విజయవాడలో వరదలపై రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద వస్తుందని తమకు ముందే తెలుసన్నారు. వరద గురించి చెప్పిన పట్టించుకోరని ప్రజలకు చెప్పలేదని అన్నారు. ప్రస్తుతం సిసోడియా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి.