/rtv/media/media_files/2025/11/11/delhi-2025-11-11-10-54-13.jpg)
Delhi
ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్‌లో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. కొన్ని ఏరియాల రోడ్లు, మెట్రో స్టేషన్లను క్లోజ్ చేశారు. ఎర్రకోట వద్ద పేలుడు జరగడంతో ముందు జాగ్రత్తగా DMRC కొన్ని మెట్రో స్టేషన్లను పూర్తిగా మూసివేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఓపెన్ చేయకూడదని తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా DMRC ఎర్రకోట సమీపంలోని వాలెట్ లైన్‌లోని స్టేషన్, లాల్ క్విలా మెట్రో స్టేషన్‌ను మూసివేసింది. ఈ ఏరియాల్లోని పలు రోడ్లను కూడా క్లోజ్ చేసింది. దీని వలన ప్రయాణికులకు అసౌకర్యం కలగవచ్చని తెలిపింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: ఢిల్లీ కారు బాంబు అనుమానితుడు గుర్తింపు..ఫోటో విడుదల
"Lal Qila Metro Station is closed due to security reasons. All other stations are functional as normal," tweets Delhi Metro Rail Corporation. pic.twitter.com/LDfpGj11Tw
— ANI (@ANI) November 11, 2025
మెట్రో కాశ్మీర్ గేట్ నుంచి బల్లభ్‌గఢ్ వరకు మెట్రో నడుస్తుంది. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు శబ్దం ITO వరకు వినిపించింది. ఈ పేలుడుతో భూగర్భ మెట్రో స్టేషన్ అద్దాలు పగిలిపోయాయి. అయితే గేట్ 1, 4- రెడ్ ఫోర్ట్, ఇండియన్ వార్ మ్యూజియం, లాహోరీ గేట్, బల్లిమారన్, దిగంబర్ జైన్ లాల్ మందిర్, చాందినీ చౌక్ రోడ్, సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి, గురుద్వారా సిస్గంజ్ సాహిబ్ దగ్గరకు చేరుకుంటారు. అదే గేట్ 2, 3- అయితే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్, సెయింట్ మేరీస్ కాథలిక్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్, GPO, రింగ్ రోడ్, అంగురి బాగ్, S. P. ముఖర్జీ మార్గ్, యమునా బజార్, సెయింట్ మేరీస్ కాథలిక్, ప్రెజెంటేషన్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్, S. P. ముఖర్జీ మార్గ్, యమునా బజార్‌కు వెళ్తారు.
అసలేమైందంటే?
ఎర్రకోట మెట్రో స్టేషన్‌లోని గేట్ నంబర్ 4 వద్ద సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. బాంబు పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో దాని ప్రతిధ్వని IIO వరకు వినిపించింది. ఈ పేలుడు ధాటికి కారులోని ఓ భాగం ఎర్రకోట సమీపంలోని ఎర్ర దేవాలయంపై పడి, దాని కిటికీలు పగిలిపోయాయి. చాందిని చౌక్‌లోని భగీరథ్ ప్యాలెస్ ప్రాంతం వరకు ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఆ ఏరియాల్లో హైఅలర్ట్ విధించారు. వీటితో పాటు విమానాశ్రాయాలను కూడా అధికారులు అలర్ట్ ప్రకటించారు.
ఇది కూడా చూడండి: Delhi Blast Updates: ఢిల్లీ పేలుడు ఘటన.. బాధితుల ఫుల్ లిస్ట్ ఇదే..!
Follow Us