/rtv/media/media_files/2025/11/11/delhi-blast-2025-11-11-10-22-24.jpg)
Delhi Blast
Delhi Blast Updates: దేశ రాజధాని డిల్లీలో సోమవారం సాయంత్రం భయంకర బాంబు పేలుడు జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఐ20 కారు ఒక్కసారిగా పేలడంతో వాహనాలు చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి, చుట్టుపక్కల పరిస్థితి భయంకరంగా మారింది. ఈ ఘటనలో కొన్ని మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని వెంటనే సమీప హాస్పిటల్స్‌లో చేర్చారు, కొందరిని అత్యవసర చికిత్సకు తరలించారు.
పోలీసులు, ఇతర సెంట్రల్ బృందాలు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు మరణించిన వారి వివరాలు పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉన్నాయి, ఇంకా మరికొంతమందిని గుర్తించే చర్యలు జరుగుతున్నాయి. గాయపడినవారి లిస్ట్ ఇప్పటికే కొన్ని పేర్లు వెలువడింది, జరిగిన ఘటన వల్ల వీరి కుటుంబాలు అల్లాడిపోతున్నారు. అక్కడి స్థానికులు, వాహనదారులు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఘటన స్థలం రెడ్ ఫోర్ట్ పరిధిలో ఉండటంతో, పర్యాటకులు, స్థానిక ప్రజలు, వాహనదారులు బాగా ఉండే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించడం మరింత ప్రమాదకరంగా ఉంది. ఒక్కసారిగా జరిగిన పేలుడు ధాటికి వాహనాలు, షాపులు, పోలీసులు ఉన్న పోలీస్ పోస్ట్ కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి.
ఈ పేలుడు ఉగ్రవాదుల కుట్ర కారణంగా జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో భద్రతను మరింత పెంచారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో పోలీస్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. ప్రజలకు భయపడకూడదని, శాంతంగా ఉండి ఏ అనుమానాస్పద వ్యక్తి, వాహనం, కదలిక కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
గాయపడినవారి వివరాలు(Delhi Blast Victims List)
- షైన్ పర్వీన్, ఖ్వాబ్ బస్తీ, మిర్ఫ్ రోడ్, షకుర్ కీ దుండి, ఢిల్లీ
- హర్షుల్, గదర్‌పూర్, ఉత్తరాఖండ్
- శివ జైస్వాల్, డియోరియా, ఉత్తరప్రదేశ్
- సమీర్, మండవాలి, ఢిల్లీ
- జోగిందర్, నంద్ నగరి, దిల్షాద్ గార్డెన్, ఢిల్లీ
- భవానీ శంకర్ సహర్మ, సంగం విహార్, ఢిల్లీ
- గీత, కృష్ణ విహార్, ఢిల్లీ
- వినయ్ పాఠక్, అయా నగర్, ఢిల్లీ
- పప్పు, ఆగ్రా, ఉత్తరప్రదేశ్
- వినోద్, బాట్జిత్ నగర్, ఢిల్లీ
- శివం ఝా, ఉస్మాన్‌పూర్, ఢిల్లీ
- అమన్, వివరాలు తెలియవు
- మహ్మద్ షానవాజ్, దర్యాగంజ్, ఢిల్లీ
- అంకుష్ శర్మ, ఈస్ట్ రోహ్తాష్ నగర్, షాహదారా
- మహ్మద్ ఫరూక్, దర్యాగంజ్, ఢిల్లీ
- తిలక్ రాజ్, రోహంపూర్, హిమాచల్ ప్రదేశ్
- మహ్మద్ సఫ్వాన్, సీతా రామ్ బజార్, ఢిల్లీ
- మహ్మద్ దావూద్, అశోక్ విహార్, ఘజియాబాద్
- కిషోరి లాల్, యమునా బజార్, కాశ్మీరీ గేట్, ఢిల్లీ
- ఆజాద్, 5వ పుష్ట, కర్తార్ నగర్, ఢిల్లీ
ప్రతి నగరంలో భద్రతా చర్యలు కఠినంగా చేస్తున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది.
Follow Us