BIG BREAKING: ఢిల్లీ కారు బాంబు అనుమానితుడు గుర్తింపు..ఫోటో విడుదల

ఢిల్లీ కారు బాంబు పేలుడు అనుమానితుడిని అధికారులు గుర్తించారు. ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ మొహమ్మద్ గా అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ లో ఇద్దరు డాక్టర్లుకు సన్నిహితుడని చెబుతున్నారు.

New Update
umar

ఢిల్లీ బాంబు పేలుడు అనుమానితుడిని అధికారులు గుర్తించారు. కారు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని ఐడెంటిఫై చేశారు. ఆత్మాహుతి బాంబర్ గా అనుమానిస్తున్న డాక్టర్ మొహమ్మద్ ఫోటోను అధికారులు బయటపెట్టారు. బాంబు పేలిన కారు ఉమర్ సొంత కారని చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 24, 1989న జన్మించిన ఉమర్.. అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసు బృందాలు చేజిక్కించుకున్న "వైట్ కాలర్" టెర్రర్ మాడ్యూల్‌లో సోమవారం అరెస్టు చేసిన ఇద్దరు వైద్యులు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్షకీల్‌లకు..ఉమర్ సన్నిహితుడని తెలుస్తోంది. వీరందరూ ఒకే టెర్రర్ గ్రూపుకు చెందిన వారుగా గుర్తించారు. తన సహచరుల అరెస్టు గురించి తెలుసుకున్న డాక్టర్ ఉమర్.. ఫరీదాబాద్ నుండి పారిపోయాడు. దాని తరువాత భయాందోళనకు గురై పేలుడుకు పాల్పడ్డాడని తెలుస్తోంది. మరో ఇద్దరు సహచరులతో కలిసి దాడికి ప్రణాళిక వేసి కారులో డిటోనేటర్ అమర్చాడని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.

ఎర్రకోట దగ్గరే దాదాపు మూడు గంటలు..

ఇక బాంబు పేలిన కారు ఐ20 కు సంబంధించి సీసీ టీవీ ఫుటేజి వీడియోలు బయటపడ్డాయి. HR 26CE7674 నంబర్ ప్లేట్ ఉన్న ఆ వాహనం కోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటలకు పైగా ఉందని...మధ్యాహ్నం 3:19 గంటలకు లోపలికి ప్రవేశించి సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కారును చివరి సారిగా పుల్వామాకు చెందిన తారీఖ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బాంబు బ్లాస్ లో వాడిన కారుపై పలు ట్రాఫిక్‌ చలానాలు ఉన్నట్లు తేలింది. ఇందులో దిల్లీఎన్సీఆర్‌ ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటినీ క్లియర్‌ చేసినట్లు రికార్డులు చూపిస్తున్నాయి.

Also Read: Delhi Bomb Blast: కారు సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి..డ్రైవర్ వైద్యుడిగా గుర్తింపు

Advertisment
తాజా కథనాలు