/rtv/media/media_files/2025/12/20/delhi-index-2025-12-20-12-03-57.jpg)
delhi index
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో దట్టమైన పొగమంచు(fogg) కమ్మేసింది. ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(air-quality-index) (AQI) 384గా నమోదైంది. అనేక ప్రాంతాల్లో 400 దాటిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్కల ప్రకారం ఐటీఓ (429), ఆనంద్ విహార్ (428), సరామ్ కాలే ఖాన్ (428) వంటి ప్రాంతాల్లో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. గాలిలో విషతుల్యమైన కణాలు పెరగడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ బాగా తగ్గిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 100 విమానాలు రద్దయ్యాయి. అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ జారీ చేశారు. విమానాల తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థలను సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. వాహనదారులు లైట్లు వేసుకుని అతి తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నారు. - delhi-air-quality
दिल्ली में लगातार 7वें दिन हवा जहरीली, कई इलाकों में AQI 400 पार#DelhiAirPollution#DelhiAQI#DelhiPollution#AirPollution#Smog@AmitPalit_3pic.twitter.com/11rZNqxLVH
— India TV (@indiatvnews) December 20, 2025
కఠిన చర్యలు చేపట్టిన కమిషన్..
వాయు నాణ్యత పూర్తిగా పడిపోవడంతో ఎయిర్ క్వాలిటీ(Air Quality) మేనేజ్‌మెంట్ కమిషన్ కఠిన చర్యలు చేపట్టింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో స్టేజ్-4 ఆంక్షలను అమలు చేస్తున్నారు. దీని ప్రకారం నగరంలో అన్ని రకాల నిర్మాణ పనులను నిలిపివేశారు. డీజిల్ వాహనాల ప్రవేశంపై కఠినమైన ఆంక్షలు విధించారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించడం లేదా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం వంటి చర్యలు కూడా నిర్వహిస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు రోడ్లపై నీటిని చల్లడం వంటి పనులు కూడా మున్సిపల్ సిబ్బంది చేస్తోంది. దట్టమైన పొగమంచు కారణంగా కళ్ల మంటలు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో పలువురు బాధపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు బయటకు రావొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగమంచులో ఉండే ప్రమాదకరమైన సూక్ష్మ కణాలు ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయని, మాస్కులు ధరించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. సాయంత్రం, ఉదయం వేళల్లో బయట వ్యాయామాలు చేయకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: BEAKING: తెలంగాణలో దారుణ హత్య.. కత్తులు స్కూడ్రైవర్లతో పొడిచి..
Follow Us