/rtv/media/media_files/2026/01/19/prateek-2026-01-19-15-55-16.jpg)
Akhilesh Yadav's brother Prateek calls wife Aparna 'bad soul', to get divorced
సమాజ్‌వాది పార్టీ(SP) వ్యవస్థాపకుడు దివంగత ములాయమ్ సింగ్ యాదవ్ ఇంట్లో చోటుచేసుకుంటున్న విభేదాలు సంచలనం రేపుతున్నాయి. ఆయన కొడుకు, అఖిలేష్ యాదవ్ సోదరుడైన ప్రతీక్ యాదవ్(Prateek Yadav) తన భార్య అపర్ణ యాదవ్(Aparna Yadav) పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెను తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తిగా అభివర్ణిస్తూ ఇన్‌స్ట్రామ్‌లో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. అపర్ణ ఫొటోకు ఫ్యామిలీ డిస్ట్రాయర్ అనే క్యాప్షన్ ఇచ్చి పోస్టు చేశారు. అలాగే ఆమెకు తాను విడాకులు ఇవ్వబోతున్నట్లు రాసుకొచ్చారు. మా కుటుంబ బంధాలను ఆమె నాశనం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Akhilesh Yadav's Brother Prateek Calls Wife Aparna Bad Soul
Also Read: ఒక వ్యక్తి ఎన్ని బీర్లు తాగొచ్చు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?
ఆమె ఫేమస్ అవ్వాలని మాత్రమే కోరుకుంటోందని ఆరోపించారు. ప్రస్తుతం నా మానసిక పరిస్థితి సరిగా లేదని అయినప్పటికీ ఆమె నన్ను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎందుకంటే ఆమె తన గురించి మాత్రమే ఆలోచిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చెడ్డ వ్యక్తిని తాను ఎప్పుడూ చూడలేదని.. ఆమెను పెళ్లి చేసుకోవడం నా దురదృష్టం అంటూ రాసుకొచ్చారు.
Also Read: దండకారణ్యంలో కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి
ఇదిలాఉండగా 2011లో ప్రతీక్, అపర్ణ వివాహం చేసుకున్నారు. 2017లో ఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసిన అపర్ణ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 2022 మార్చిలో బీజేపీలో చేరింది. ఆ పార్టీలో యాక్టివ్‌గా ప్రచారం చేసింది. ఆ తర్వాత 2024 సెప్టెంబర్‌లో ఆమెను బీజేపీ రాష్ట్ర మహిళా కమిషన్‌కు వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. ప్రస్తుతం ప్రతీక్, అపర్ణ మధ్య జరుగుతున్న విభేదాల గురించి ఎస్పీ గానీ బీజేపీ గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Follow Us