Delhi Elections 2025: బీజేపీని గెలిపించారు.. ఆప్‌ను ముంచారు.. ఢిల్లీ రిజల్ట్స్‌ను రివర్స్ చేసిన జంపింగ్‌లు!

ఢిల్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలు ఘన విజయాలు సాధించారు. కానీ బీజేపీ నుంచి ఆప్, కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారు దారుణంగా ఓటమిపాలయ్యారు. బీజేపీ సాధించిన ఈ అఖండ విజయంలో భారీ ఓట్లను కొల్లగొట్టిన వారి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ చదవండి. 

New Update
delhi elc

Delhi elections 2025 parties changed leaders Huge victory

Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఘన విజయాలు సాధించారు. ఆప్-కాంగ్రెస్‌ అభ్యర్థులు ఊహించని రీతిలో విఫలమయ్యారు. 1998లో అధికారం కోల్పోయిన బీజేపీ ఈ విజయంతో 27 సంవత్సరాల సుధీర్ఘ విరామానికి గుడ్ బై చెప్పి రాజధానిలో తిరిగి అధికారంలోకి వచ్చింది. మోదీ నాయత్వంలోని బీజేపీ 48 స్థానాల్లో గెలవగా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. బీజేపీ సాధించిన ఈ అఖండ విజయంలో క్షేత్రస్థాయి నాయకులే కాకుండా వివిధ పార్టీల నుంచి వచ్చిన నేతలు సైతం భారీ ఓట్లను కొల్లగొట్టారు. అందులో కొంతమంది వివరాలు ఇలా ఉన్నాయి. 

అరవిందర్ సింగ్ లవ్లీ

అరవిందర్ లవ్లీ 2003 నుంచి 2013 వరకు షీలా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌లో అనుభవజ్ఞుడిగా పరిగణించబడే లవ్లీ.. రెండుసార్లు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా విధులు నిర్వర్తించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు లవ్లీ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఈసారి అరవిందర్ సింగ్ లవ్లీ తన సాంప్రదాయ నియోజకవర్గమైన గాంధీనగర్‌లో భారీ విజయం సాధించారు.

ప్రిన్స్ చౌహాన్

షీలా దీక్షిత్ ప్రభుత్వంలో రాజ్ కుమార్ చౌహాన్ రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. అరవిందర్ సింగ్ లవ్లీతో పాటు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఖీ బిర్లా చేతిలో రెండుసార్లు ఓడిపోయిన రాజ్ కుమార్.. ఈసారి మంగోల్‌పురిలో బీజేపీ టికెట్‌పై గెలిచారు.

కైలాష్ గెహ్లాట్

కొన్ని నెలల క్రితం వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కైలాష్ గెహ్లాట్.. ఈ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై బిజ్వాసన్ అసెంబ్లీ స్థానంనుంచి పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కైలాష్ గెహ్లాట్ ఆమ్ ఆద్మీ పార్టీని విడారు. దీనికి ప్రతిఫలంగా బీజేపీ అతనికి ఇష్టమైన బిజ్వాసన్ సీటు నుండి టికెట్ ఇచ్చింది.

నీరజ్ బసోయా

న్యూఢిల్లీ కస్తూర్బా నగర్ స్థానానికి కాంగ్రెస్‌ను వీడిన నీరజ్ బసోయాను బీజేపీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. నీరజ్ ఇంతకు ముందు 2008లో కాంగ్రెస్ టికెట్‌పై ఈ స్థానం నుండి ఎమ్మెల్యే అయ్యారు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభిషేక్ దత్ కంటే ఆయనకు ప్రాధాన్యత ఇస్తోంది. నీరజ్ బసోయా పార్టీని వీడటానికి కూడా ఇదే కారణం. కఠినమైన పోటీలో నీరజ్ అభిషేక్ దత్‌ను ఓడించాడు.

తర్విందర్ సింగ్ మార్వార్
తర్విందర్ సింగ్ మార్వార్ జంగ్‌పురా నుండి కాంగ్రెస్ టికెట్‌పై మూడుసార్లు గెలిచారు. ఈసారి ఆయన బీజేపీలో చేరి ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీష్ సిసోడియాను ఓడించారు. షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్వార్ ఆమెకు పార్లమెంటరీ కార్యదర్శిగా ఉన్నారు.

మంజీందర్ సింగ్ సిర్సా
ఒకప్పుడు అకాలీదళ్ ద్వారా ఢిల్లీలో సిక్కు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న మంజిందర్ సింగ్ సిర్సా.. కొన్ని సంవత్సరాల క్రితం బీజేపీలో చేరారు. అకాలీదళ్‌ను విడిచిపెట్టిన తర్వాత సిర్సా పార్టీలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈసారి మంజీందర్ సింగ్ సిర్సా రాజౌరి గార్డెన్ నుండి ఎమ్మెల్యే అయ్యారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు ఏమైంది?
ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరిన నాయకులు అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లో చేరిన చాలా మంది నాయకులు ఓటమిని చవిచూశారు. బీజేపీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన అనిల్ ఝా.. కిరారి అసెంబ్లీ స్థానం నుండి ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఇతర నాయకులకు అంత అదృష్టం దక్కలేదు. కాంగ్రెస్‌ను వీడి ఆప్‌లో చేరిన చౌదరి జుబైర్ అహ్మద్ సీలంపూర్ నుంచి ఎన్నికల్లో విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: PM Modi: ఢిల్లీని గెలిచిన మోదీ.. నెక్ట్స్ టార్గెట్ ఈ రాష్ట్రాలే!

బీజేపీని వదిలి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన బిబి త్యాగి.. లక్ష్మీ నగర్ నుంచి అభయ్ వర్మ చేతిలో ఓడిపోయారు. జితేంద్ర సింగ్ శాంతి బీజేపీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అతనికి షాదారా అసెంబ్లీ నుండి టికెట్ కూడా ఇచ్చారు. కానీ అతను బీజేపీకి చెందిన సంజయ్ గోయల్ చేతిలో ఓడిపోయాడు. కాంగ్రెస్‌లో ఆ తర్వాత బీజేపీలో ఉన్న సురేంద్ర పాల్ సింగ్ బిట్టును ఆమ్ ఆద్మీ పార్టీ తిమార్‌పూర్ నుంచి పోటీకి నిలబెట్టింది. కానీ ఆ ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి సూర్య ప్రకాష్ ఖత్రి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ముఖేష్ గోయల్, వినయ్ మిశ్రా కూడా ఆదర్శ్ నగర్, ద్వారక స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఇది కూడా చదవండి: Delhi Elections: ఫలించిన బీజేపీ ఎత్తుగడ..ఓడిన అరవింద్ కేజ్రీవాల్

ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులు దారుణంగా ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ ఈసారి కూడా ఢిల్లీలో ఖాతా తెరవలేకపోయింది. సీలంపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే అబ్దుల్ రెహమాన్ ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చారు. కానీ ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుండి కాంగ్రెస్‌కు మారిన హాజీ ఇష్రాక్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన బాబర్‌పూర్ నుండి గోపాల్ రాయ్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన కల్నల్ దేవేంద్ర సెహ్రావత్ కూడా బిజ్వాసన్ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు