Jeans: టైట్ జీన్స్ వేసుకుంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు
యువకులతో పాటు మధ్య వయస్కులు టైట్ జీన్స్ ధరించి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల స్క్రోటమ్ ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీనివల్ల పురుషుల వీర్యం తగ్గిందని ఢిల్లీ ఎయిమ్స్ చేసిన అధ్యయనంలో తేలింది. అందుకే టైట్ జీన్స్, లోదుస్తులను ధరించవద్దని నిపుణులు చెబుతున్నారు.