America: ఉద్యోగం కోసం ఇక అమెరికా పోలేరు.. భారతీయులకు ఊహించని షాక్ ఇచ్చిన ట్రంప్

అమెరికాలో H-1B వీసా, గ్రీన్ కార్డ్ రూల్స్ మొత్తం మార్చబోతున్నామని ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. ప్రస్తుత లాటరీ పద్ధతిని రద్దు చేసి, నైపుణ్యం, వేతనం ఆధారంగా వీసాలు జారీ చేస్తామని ఆయన తెలిపారు.

New Update
H1B and Green Card visa rules

అమెరికాలో H-1B వీసా, గ్రీన్ కార్డ్ రూల్స్ మొత్తం మార్చబోతున్నామని ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. ప్రస్తుత లాటరీ పద్ధతిని రద్దు చేసి, నైపుణ్యం, వేతనం ఆధారంగా వీసాలు జారీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ మార్పులు ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, తాము ఈ కొత్త సంస్కరణలను తీసుకురానున్నట్లు లుట్నిక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న లాటరీ వ్యవస్థ ద్వారా అర్హత లేని, తక్కువ వేతనం పొందే వ్యక్తులకు కూడా గ్రీన్ కార్డ్ లభిస్తోందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఆయన వాదించారు. సగటు అమెరికన్ వార్షిక ఆదాయం $75,000 ఉండగా, గ్రీన్ కార్డ్ హోల్డర్ సగటు వార్షిక ఆదాయం $66,000 మాత్రమే ఉందని, ఇది 'తక్కువ సంపాదన' వ్యక్తులను ఎంపిక చేయడమేనని లుట్నిక్ అన్నారు.

ఈ కొత్త విధానంలో H1B వీసాలను ఎక్కువ సాలరీలు ఉన్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. దీంతోపాటు, ట్రంప్ ప్రభుత్వం 'గోల్డ్ కార్డ్' అనే కొత్త వీసా ప్లాన్ కూడా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికాలో $5 మిలియన్లు పెట్టుబడి పెట్టే విదేశీయులకు శాశ్వత నివాసం కల్పిస్తారు. ఈ కార్డ్‌కు అప్లై చూసుకోడానికి దాదాపు 2,50,000 మంది దరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నారని, దీని వల్ల $1.25 ట్రిలియన్ల పెట్టుబడులు వస్తాయని లుట్నిక్ తెలిపారు.

ఈ మార్పులు భారతీయ నిపుణులను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే, ప్రతి సంవత్సరం H-1B వీసాలు పొందుతున్న వారిలో 70% కంటే ఎక్కువ మంది భారతీయులే. లాటరీ పద్ధతి రద్దు అయితే, అనేక మంది భారతీయ టెక్కీలకు అమెరికాలో ఉద్యోగాలు లభించడం కష్టం కావచ్చు. అయితే, స్కిల్స్, ఎక్కువ సాలరీ ఉన్న వారికి మాత్రం ఈ మార్పులు అనుకూలంగా మారే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ కొత్త విధానంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు