/rtv/media/media_files/2025/08/23/modi-to-scientists-on-national-space-day-2025-08-23-14-51-33.jpg)
Modi to scientists on National Space Day
జాతీయ అంతరిక్ష దినోత్సవం(national-space-day) సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష రంగంలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోందని అన్నారు. రెండేళ్ల క్రితం చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపిన మొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించిందని తెలిపారు. భవిష్యత్తులో 50 రాకెట్లను ప్రయోగించే స్థాయికి భారత్ చేరుకుంటుందా అని అంతరిక్ష శాస్త్రవేత్తలను ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఆ స్థితికి చేరుకునేలా ప్రణాళికలు రచించాలన్నారు. అంతరిక్ష రహస్యాలు తెలుసుకునేందుకు లోతైన పరిశోధనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Also Read: ధర్మస్థల కేసులో ఊహించని ట్విస్టులు.. సాక్షులు ఎందుకు మాట మార్చారు ? కారణం అదేనా
PM Modi Key Notes On National Space Day
'' అంతులేని విశ్వం మకు ఏది సరిహద్దు కాదని చెబుతోంది. అలాగే భారత్‌కు కూడా ఎలాంటి హద్దులు లేకుండా స్పేస్ రంగంలో ముందుకెళ్లాలి. శాస్త్రవేత్తలు గగన్‌యాన్(gaganyan) మిషన్ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. తర్వలోనే ఈ మిషన్‌ను ప్రారంభించనున్నాం. మరికొన్నేళ్లలో మనమే సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటాం. అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు రంగాలు సైతం ముందుకు రావాలని'' ప్రధాని మోదీ అన్నారు.
Greetings on National Space Day! India's journey in space reflects our determination, innovation and the brilliance of our scientists pushing boundaries. https://t.co/2XPktf49Ao
— Narendra Modi (@narendramodi) August 23, 2025
Also Read: అదో పెద్ద తలనొప్పి..నూనె, వెనిగర్ లా కలవడం లేదు..పుతిన్, జెలెన్ సమాశంపై ట్రంప్ వ్యాఖ్య
ఇదిలాఉండగా 2040 నాటికి చంద్రుడిపై భారత ఆస్ట్రోనాట్‌ను దించుతామని ఇస్రో(isro) మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. అంతరిక్ష యాత్రల కోసం నలుగురు ఆస్ట్రోనాట్స్‌ను ఎంపిక చేశామని తెలిపారు. వీళ్లందరూ కూడా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లు అని చెప్పారు. రోదసి అన్వేషణలో భాగంగా గగన్‌యాన్ ప్రాజెక్టు కీలకంగా మారనుందన్నారు. ఇద్దరు లేదా ముగ్గురు భారత వ్యోమగాములను దిగువ భూకక్ష్యలోకి పంపిస్తామని చెప్పారు. మూడు రోజల అనంతరం వారు భూమిపైకి వస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం వీళ్లందరూ బెంగళూరులోని వ్యోమగామి ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రుడి కక్ష్యలోకి శాటిలైట్, అలాగే అంగారకుడి పైకి ల్యాండర్ ప్రయోగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచనలు చేశారు.