Operation Sindoor: ఆపరేషన్ తర్వాత పాక్ 138 శౌర్య పతకాల అవార్డుల ప్రకటన.. రాహుల్ గాంధీకి ఈ సాక్ష్యం చాలా? ఇంకా కావాలా?

ఆపరేషన్ సింధూర్ జరగలేదని బుకాయిస్తతూ వచ్చిన పాకిస్తాన్ మొదటిసారి తమ సైనికులకు శౌర్య పతకాలను ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన 138 మంది వీర జవాన్ల లిస్ట్ విడుదల చేసింది. రాహుల్ గాంధీ కి ఈ లెక్కలు చాలా ఇంకా కావాలా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

Operation Sindoor: పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల "ఆపరేషన్ సిందూర్"లో పాల్గొన్న 138 మంది సైనికులకు పతకాలను ప్రకటిస్తూ ఒక గ్యాలంట్రీ రోల్‌ను ప్రచురించింది. ఇందులో పేర్లతో సహ లిస్ట్ ను ఇచ్చింది.  పాకిస్తాన్ పతకాలను ప్రకటించడం..
యుద్ధంలో చనిపోయిన వార సంఖ్యను ప్రకటించడం..ఒక తీవ్రమైన పోరాటానికి సంకేతంగా ఉంది.  కార్గిల్ యుద్ధంలో తమ పాత్రను ఇప్పటి వరకు ఒప్పుకోని పాకిస్తాన్, తమ సైనికుల మృతదేహాలను కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత చనిపోయిన వారి పేర్లు, వారికిచ్చే పతకాలతో సహా అధికారిక పత్రం విడుదల చేసింది. అంటే దానర్థం ఆపరేషన్ సింధూర్ జరిగిందని పాక్ ఒప్పుకున్నట్లే. భారత్ చెప్పిందే జరిగిందని.. భారత్ దెబ్బకు పాక్ సైన్యం చుక్కలు చూసిందని.. చెబుతున్నారు విశ్లేషకులు. 

Also Read: భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్‌ సేవలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

చెబుతున్న లెక్కలు కంటే ఇంకా ఎక్కువే..

శౌర్య పతకాలు కేవలం చనిపోయిన వారికే ఇస్తారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఇవన్నీ పాక్ ప్రభుత్వం చేస్తోందా. 138 మందికి పతకాలు ఇస్తున్నారు అంటే వందల మంది అక్కడ ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారని చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ మరణాలను పాక్ దాచిపెట్టలేదు. కార్గిల్ యద్ధం కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ చేసిన అతిపెద్ద ఒప్పుకోలు ఇది. కార్గిల్‌లో 453 మంది చనిపోయారని పాక్ అంగీకరించింది. కానీ నిజానికి ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు కేవలం 36 గంటలపాటూ జరిగిన పోరాటంలోనే 138 మంది చనిపోయారంటే అప్పుడు కనీసం వెయ్యి దాకా సైనికులు ప్రాణాలు పొగొట్టుకుని ఉంటారు. 

Also Read: స్నేహితుడు సినిమా రిపీట్.. వైద్యుడి వీడియో కాల్‌తో ఇంట్లోనే భార్యకు ప్రసవం చేసిన భర్త

ఇప్పుడు కూడా ఆధారాలు అడుగుతారా?

ఈ లెక్కలు చూసైనా ప్రతిపక్ష నేతలు ఆపరేషన్ సింధూర్ మీద అనుమానాలు తగ్గించుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. రుజువులు కావాలని అడగడం మానేయాలని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాదు, భారత ఆర్మీపై అనుమానం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ బుకాయింపుకు వంత పాడారు. కానీ ఇప్పుడు ఆ దేశమే స్వయంగా లెక్కలు చెబుతోంది. వీటిని చూశాక కూడా రాహుల్ సాక్ష్యాలు అడుగుతారా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. లేదా వారు కూడా ఎలా చనిపోయారని పాకిస్తాన్ ను ప్రశ్నిస్తారా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈసారి ఆధారాలు ఇస్లామాబాద్ నుంచి వచ్చాయి. ఈ గణాంకాలు ఒక మలుపు. రాహుల్ గాంధీ ఇప్పుడు పాకిస్తాన్ ను ఈ లెక్కల విషయంలో అడగకపోతే..భారత్  విజయాలను ప్రశ్నించే హక్కు కూడా లేదని అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ లో పాక్ చూపుతున్న లెక్కలు నిజమేనని.. 36 గంటల్లో భారత బలగాలు అంతటి నష్టాన్ని కలిగించాయని చెబుతున్నారు. యూపీఏ తన హయాంలో మెతక వైఖరి అనుసరించింది. అలీ షా గిలానీ ముప్పుతిప్పలు పెట్టాడు. కానీ అప్పుడు అలాంటి వారిని అణిచివేయకుండా నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాత్రం అలా కాదు. వేర్పాటు వాదులను, హింసను ప్రోత్సహిస్తూ పాక్‌కు మద్దతుగా నిలిచేవారిపట్ల కఠిన వైఖరితో వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ ఏ మాత్రం తప్పు చేసినా భారీ ముల్యం చెల్లించుకోక తప్పదని తెలియజెప్పింది. 

Advertisment
తాజా కథనాలు