CRPF: పాక్‌ మహిళతో CRPF జవాన్ పెళ్లి.. చివరికి ఊహించని షాక్

ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాను పాకిస్థానీ మహిళను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. వీసా గడువు ముగిసిన కూడా ఆమెను ఇక్కడే ఉంచాడు. దీంతో CRPF ..ఆ జవాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
CRPF dismisses jawan who married Pakistani woman without intimation

CRPF dismisses jawan who married Pakistani woman without intimation

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాను పాకిస్థానీ మహిళను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. వీసా గడువు ముగిసిన కూడా ఆమెను ఇక్కడే ఉంచాడు. దీంతో CRPF ..ఆ జవాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. పాకిస్థానీయులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఇప్పటికే భారత్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పాక్ మహిళ గురించి వివరాలు అడగగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  

Also Read: భార్యను చంపి మంచం కింద పాతిపెట్టిన భర్త.. చేయి బయటకు రావడంతో ఊహించని ట్విస్ట్!

CRPF 41వ బెటాలియన్‌కు చెందిన మునీర్ అహ్మద్ అనే జవాన్ 2024లో మే నెలలో పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళను వీడియో కాల్‌ ద్వారా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె వీసాపై ఇండియాకు వచ్చింది. కానీ ఈ విషయాన్ని అతడు ఉన్నతాధికారులకు చెప్పలేదు. అంతేకాదు ఆమె వీసా గడువు ముగిసినా కూడా ఇంకా ఇక్కడే ఉంటోంది. ఇటీవల పహల్గాం ఉగ్రఘటన జరిగిన తర్వాత పాకిస్థానీయులను దేశం నుంచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

Also Read: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం.. ప్రజల దృష్టి మార్చేందుకే ఉగ్రదాడికి దిగిందా ?

చివరికీ CRPF ఉన్నతాధికారులు మునీర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. పాక్ మహిళతో పెళ్లి జరిగిన విషయాన్ని చెప్పకుండా, ఆమె వీసా గడువు ముగిసినా కూడా ఆశ్రయం కల్పించినందుకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించామని ఓ CRPF ప్రతినిధి తెలిపారు. రూల్స్ ఉల్లంఘించడంతో పాటు జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా ఇలా ప్రవర్తించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు .   

Also Read: లండన్‌లో భారత జెండాను అవమానించిన అల్లరి మూకలు.. కాళ్ల కింద నలిపేసిన వీడియో

telugu-news | rtv-news | national-news | wedding

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు