/rtv/media/media_files/2025/05/23/Uoc3eKurS3W920lWylfR.jpg)
హత్య, హత్యాయత్నం ఆరోపణలపై 43 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన 104 ఏళ్ల వృద్ధుడిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అతనితో పాటుగాఈ కేసులో మరో ముగ్గురికి కూడా జీవిత ఖైదు పడింది. శిక్ష అనుభవిస్తున్న క్రమంలోనే ముగ్గురు మరణించారు. తాజాగా కోర్టు తీర్పుతో 104 ఏళ్ల వృద్ధుడు రిలీజ్ అయ్యాడు. కౌశాంబి జిల్లాలోని గౌరాయే గ్రామంలో నివసించే లఖన్, జనవరి 4, 1921న జన్మించాడు. అతని జైలు రికార్డుల ప్రకారం అతన్ని 1977లో అరెస్టు చేశారు. 1977 ఆగస్టు 16న గౌరాయే గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అందులో ప్రభూ సరోజ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
🚨 🚨 #BreakingNews 104-Year-Old Life Convict Acquitted After 43 Years In Prison In UP https://t.co/jWoxlmSPrH
— Instant News ™ (@InstaBharat) May 23, 2025
A 104-year-old man who spent 43 years in jail on charges of murder and attempted murder was released from the Kaushambi district jail after being acquitted by a high…
అలహాబాద్ హైకోర్టులో అప్పీల్
ఈ కేసులో లఖాన్ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ప్రయాగ్‌రాజ్‌లోని జిల్లా సెషన్స్ కోర్టు 1982లో తీర్పు వెలువరించింది. అయితే దీనిని సవాల్ చేస్తూ నలుగురు నిందితులు అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేస్తూ వచ్చారు. కేసు పెండింగ్ లోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. 2025 మే 2వ తేదీన లఖాన్‌ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. దీంతో 104 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించి లఖాన్ విడుదలయ్యాడు. అదే జిల్లాలో షరీరా గ్రామంలో ఉంటున్న ఆయన కుమార్తెకు లఖాన్‌ను జైలు అధికారులు అప్పగించారు.
Uttar Pradesh | telugu-news