/rtv/media/media_files/2025/09/20/cow-attack-video-2025-09-20-15-46-17.jpg)
Cow attacked 85 year old man in uttar pradesh kanpur kalyanpur
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని కాన్పూర్(Kanpur) లో ఒక విషాద సంఘటన ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. కళ్యాణ్‌పూర్ ప్రాంతంలోని వీధుల్లో తిరుగుతున్న ఒక ఆవు అకస్మాత్తుగా హింసాత్మకంగా మారింది. రోడ్డుపై వెళుతున్న ఒక వృద్ధుడిపై అతి దారుణంగా దాడి చేసింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలోని CCTV కెమెరాలలో రికార్డైంది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆ ఆవు నిజంగా పగబట్టిందా? అన్నట్లు ఉండటంతో షాకవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం కాదు..అభయ్ వ్యక్తిగతం...మావోయిస్టు పార్టీ
Cow Attacked Kanpur
ఒక వృద్ధుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఒక ఆవు ఒక్కసారిగా అతన్ని ఢీ కొట్టింది(Cow Attack Video). అలా ఢీ కొట్టి కొంత దూరం వరకు అతడిని ఈడ్చుకెళ్లి పడేసింది. అక్కడే రోడ్డు పక్కన బురదలో ఆ వృద్ధుడు పడిపోయాడు. ఆ తర్వాత ఆ ఆవు అతనిపై పదే పదే దాడి చేసి చాలా సేపు తొక్కింది. ఆ సమయంలో వృద్ధుడు తనను తాను రక్షించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆ ఆవు శాంతించలేదు. ఆ వృద్ధుడిపై దాడి చేస్తూనే ఉంది.
सोशल मीडिया पर वायरल वीडियो कानपुर के कल्याणपुर का है. यहां एक बुजुर्ग को गाय ने काफी देर तक बेरहमी से रौंदा. वहां मौजूद लोगों ने बड़ी मशक्कत के बाद बुजुर्ग की जान बचाई. pic.twitter.com/GhZSpn9VMj
— Abhishek Kumar (@pixelsabhi) September 19, 2025
అటువైపుగా వెళ్తున్నవారు కేకలు వేస్తూ ఆవును భయపెట్టడానికి ప్రయత్నించారు. కొందరు కర్రలు, రాళ్లు తీసుకుని ఆవును బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఆవు కొంచె కూడా బెదరకుండా వృద్ధుడిని కాళ్లతో తొక్కి తొక్కి కుమ్మేసింది. ఏదో పగబట్టినట్లు కొంత దూరం వెళ్లి మళ్లీ వచ్చి కొమ్ములతో పొడిచి పొడిచి అతి దారుణంగా దాడి చేసింది. చివరికి చుట్టూ ఉన్న వారు ఎంతో సేపు ప్రయత్నించి ఆవును తరిమేశారు.
ఆపై గాయపడిన వృద్ధుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ వృద్ధుడి శరీరంలోని అనేక భాగాలపై తీవ్ర గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతమంతా భయాందోళన వాతావరణాన్ని సృష్టించింది. కళ్యాణ్‌పూర్ ప్రాంతంలోని రోడ్లపై తరచుగా విచ్చలవిడి పశువులు తిరుగుతున్నాయని, కొన్నిసార్లు ప్రజలకు హాని కలిగిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో తిరుగుతున్న విచ్చలవిడి పశువులను పట్టుకుని సురక్షితంగా ఉంచాలని స్థానిక నివాసితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాలకు చిక్కిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు!