Prabhas in Mirai: కనిపించి 'కన్నప్ప'ని.. వినిపించి 'మిరాయ్'ని ప్రభాస్ ఆదుకున్నాడా..?

రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల "కన్నప్ప" సినిమాలో గెస్ట్ రోల్ చేశారు, అలాగే "మిరాయ్" సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చి రెండూ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆయన పాత్రలు సినిమాలకు క్రేజ్ తీసుకురావడంతో పాటు, వసూళ్లపై కూడా పాజిటివ్ ప్రభావం చూపించాయి.

New Update
Prabhas in Mirai

Prabhas in Mirai

Prabhas in Mirai: అసలు ఒక సినిమా హిట్ అవ్వడానికి ఆ సినిమా హీరో పాత్ర ఎంత ముఖ్యమో అలాగే, కొన్ని సినిమాల్లో అసలు హీరో కంటే గెస్ట్ రోల్ లో కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించే స్టార్ హీరోలు మరింత ఇంపాక్ట్ కలిగిస్తారు. ఇటువంటి ట్రెండ్ ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ లలో మనం చూస్తూనే ఉన్నాం.

అలాంటి గుర్తుండిపోయే గెస్ట్ రోల్‌లలో కోలీవుడ్ మూవీ విషయానికొస్తే విక్రమ్ లో చివర్లో సూర్య చేసిన ‘రోలెక్స్’ పాత్ర తప్పకుండా గుర్తుకొస్తుంది. కేవలం పది నిమిషాల్లోనే అతడి నటన ప్రేక్షకులను షాక్‌కి గురి చేసింది. ఇక మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తనదైన శైలిలో రెండు పెద్ద సినిమాల్లో ప్రత్యేక పాత్రలతో అలరించారు.

Also Read: లారెన్స్ "కాంచన 4"పై క్రేజీ అప్‌డేట్.. ఈసారి బొమ్మ దద్దరిల్లాల్సిందే!

సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కానీ పాన్ ఇండియా వైడ్ గా కానీ ప్రభాస్ కి ఉండే క్రేజ్ వేరే లెవెల్. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. అలాంటిది వేరేయ్ హీరో సినిమాలలో ప్రభాస్ క్యామియో రోల్ లో కనిపిస్తే ఇంకా ఆ సినిమాకి ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. అందుకు ఉదాహరణ మంచు విష్ణు, మోహన్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన "కన్నప్ప" అనే భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ప్రభాస్ కన్నప్ప లో ఓ కీలక పాత్ర చేసాడు అని తెలిసినప్పటి నుండి సినిమాపై విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అందుకు తగ్గట్టుగానే కన్నప్ప సినిమాకి ఓపెనింగ్స్ మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ గా నిలిచాయి.

ప్రభాస్ ఎంట్రీతో థియేటర్‌లో ఫ్యాన్స్ ఎంతలా ఊగిపోయారో చెప్పక్కర్లేదు. అతడి సన్నివేశాలు విజువల్ ట్రీట్ గా మారాయి. సినిమాకు Day 1 నుంచే మంచి వసూళ్లు రావడంలో ప్రభాస్ కీలకంగా మారాడని చెప్పొచ్చు. రెబల్ స్టార్ పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నాడు కాబట్టి,  బిజినెస్ పరంగా కన్నప్పకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది.

Also Read:'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో

"మిరాయ్"కు వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రభాస్.. (Prabhas Voice Over In Mirai)

ఇక నేడు (సెప్టెంబర్ 12) విడుదలైన మరో పాన్ ఇండియా మూవీ "మిరాయ్" లో కూడా ప్రభాస్ వాయిస్ ఓవర్(Prabhas Voice Over In Mirai) చెప్పి అలరించారు. తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అందరిని సర్ప్రైజ్ కి గురి చేసింది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ మొదట్లో రివీల్ చేయకుండా సీక్రెట్ గా ఉంచింది.

అయితే విడుదలకు కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించడంతో, ఒక్కసారిగా మిరాయ్ మీద టాక్ పెరిగిపోయింది. ప్రభాస్ వాయిస్ వినడం కోసం ఫ్యాన్స్‌ థియేటర్లకు వెళ్తున్నారు. దీంతో ఈ సినిమా కూడా భారీ హైప్‌ను సొంతం చేసుకుంది.

ఇలా వరుసగా రెండు సినిమాలకు ప్రభాస్ తన వంతు సహాయం చేయడం ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్ గా మారింది. ప్రధాన పాత్రలో కనిపించకపోయినా, అతడి ప్రెజెన్స్ సినిమాల క్రేజ్‌ను రెట్టింపు చేస్తోంది. అభిమానుల ఆనందానికి అయితే ఇంకా అవధులు లేకుండాపోతుంది. 

Also Read:మిరాయ్ లో ప్రభాస్..! ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా

ఇలా మన రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ అతని గెస్ట్ అప్పియరెన్స్‌లు, వాయిస్ ఓవర్‌లు సినిమాలకు కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తున్నాయి. ఇది దర్శకులకు, నిర్మాతలకు ఒక అదనపు బలంగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఇలాంటి మెగా సర్ప్రైజ్‌లు ఇంకా ఎన్ని వుంటాయో చూడాలి! 

Advertisment
తాజా కథనాలు